తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఏం చేయదలుచుకున్నావ్? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత టీఆరెస్ పాలన చూస్తుంటే టీడీపీ పాలననే తలపిస్తోందని అన్నారు. 1994 నుంచి 2004 వరకు తన పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు పాలనకు కేసీఆర్ ప్రస్తుత పాలనకు ఏమాత్రం తేడా లేదంటూ ఆయన మండిపడ్డారు.
ఊరూరా బెల్టుషాపులు పెట్టి జనానికి మద్యం తాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ''నువ్వు తాగితే తాగు.. కానీ ఆ అలవాటును ప్రజలకు ఎందుకు నేర్పుతున్నావు? " అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎందుకు తాగిస్తున్నావ్…? అసలు తెలంగాణను ఏం చేయదలుచుకున్నవ్..? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
''చంద్రబాబుకు నువ్వు ఒకప్పుడు సలహాదారువి. ఆయన పాపాల్లో నీకూ భాగస్వామ్యం ఉంది. 2004 తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే.. రైతులకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు. నీతోపాటు చంద్రబాబు వద్ద పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి - తుమ్మల నాగేశ్వరరావు - కడియం శ్రీహరి - తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారంతా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరంతా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీపాలన తెలుగుదేశం పార్టీ- బీటీమ్ పాలించినట్లు ఉంది" అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని నాశనం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలందరినీ తీసుకువచ్చి నీ వద్ద పెట్టుకుని మరోసారి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చిన రూ.790 కోట్లను ఏం చేశారని.. మద్యం ఆదాయం కింద రాష్ర్టానికి వచ్చిన రూ.12 వేల కోట్లు ఏం చేశారని నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/