లక్ష్మీపార్వతి పరువు తీస్తారా? జీవితరాజశేఖర్ ఫైర్

Update: 2019-04-06 07:20 GMT
లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందని కొంతకాలంగా ఆమె అనుచరుడిగా ఉన్న కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత వివిధ టీవీ చానెళ్లకు తిరుగుతూ లక్ష్మీపార్వతి గురించి సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. ఎన్టీఆర్ గురించి లక్ష్మీపార్వతి నీచంగా మాట్లాడేవారని.. ఆధారాలు తనవద్ద ఉన్నాయని కోటి హల్ చల్ చేస్తున్నాడు. కాగా కోటి ఆరోపణలపై ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటులు జీవితారాజశేఖర్ స్పందించారు. కోటి ఆగడాలపై నిప్పులు చెరిగారు.

లక్ష్మీపార్వతిపై అనవసరంగా అభాండాలు వేయిస్తున్నారని.. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని జీవితారాజశేఖర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ ను చేసుకున్న లక్ష్మీ పార్వతి.. జయప్రద - జయసుధ లాగా అందంగా ఉంటే ఆమె ఎప్పుడో తర్వాత సీఎం అయ్యుండేవారన్నారు. లక్ష్మీపార్వతిలో హీరోయిన్ల లాంటి అందం లేదు కాబట్టే ఇలా అయిపోందన్నారు. ఎన్టీఆర్ భార్యమీద ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దారునమని జీవితా రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ ను అందరూ వదిలేసి పట్టించుకోకపోవడంతోనే లక్ష్మీపార్వతి ఆయనకు సేవ చేసిందని.. ఆమె ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవ చేసిందని జీవిత తెలిపారు. లక్ష్మీ పార్వతి వయసు ఎంత పెద్దదని.. వాడెవడో వచ్చి ఆరోపణలు చేయడం ఏంటని జీవిత నిలదీశారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వెధవకు ఈరోజు ఎన్నికల ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని జీవిత ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నంత సేపు వాడికి తెలియదా ఏం సినిమా తీస్తున్నారనేది అని మండిపడ్డారు. అమ్మలా భావిస్తూ ఇన్నాళ్లు ఆవిడ దగ్గర ఉన్నానని అంటున్నాడని.. ఇలాంటి ఆరోపణలు చేయడం నీచం.. అది నోరా మురికికాలువా అని జీవిత నిప్పులు కురిపించారు. 

మీకు అమ్మలు, అక్కలు, చెల్లెల్లు లేరా.. వాడు ఫిర్యాదు చేశాక అది ఫ్రూవ్ అయ్యిందా లేదా తెలుసుకోకుండా చానెళ్లలో పెట్టి పరువు తీస్తారా అని మీడియాపై నిప్పులు కురిపించారు జీవిత.. మీరు అసలు ఒక అమ్మకు పుట్టినోళ్లేనా.? ఇలాంటివి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఇలా చేయడం.. మీ అమ్మనో, చెల్లినో పెట్టి సంపాదించినట్టే లెక్క అని నిలదీశారు. ఇలాంటి సంపాదన మీడియాకు అవసరమా అని మండిపడ్డారు. మీడియాను చక్కగా నడిపే వారు ఎంతో మంది ఉన్నారని.. ఒక 10శాతం వారు ఇలా మీడియా పరువు తీస్తున్నారని జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తాను వైసీపీలో చేరగానే తన కూతుళ్లకు ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యమైన కామెంట్స్  పెడుతున్నారని.. ఇంత దారునంగా ప్రవర్తిస్తారా అని జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోసల్ మీడియాలో టీడీపీ, జనసేన వారు మనుషులను పెట్టి చేయిస్తున్నారని ఆరోపించారు.
Tags:    

Similar News