భార‌త్‌-అమెరికా ఎఫెక్ట్‌.. చైనాకు మూడోసారికూడా జిన్ పింగే అధ్య‌క్షుడు!!

Update: 2023-03-10 18:25 GMT
ఇప్ప‌టికే చైనా దూకుడుతో భార‌త్‌, అమెరికా వంటి దేశాలు అనుక్ష‌ణం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. చైనా దూకుడును క‌ట్ట‌డి చేసేందుకు ఈ ప్ర‌భుత్వాలు అనేక చ‌ర్య‌లు తీసుకుం టున్నాయి. దీనికికార‌ణం.. అప్ర‌క‌టిత నియంత‌గా మారిన చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగే!  క‌మ్యూనిస్టు పునాదులు బ‌లంగా ఉన్న చైనాలో ఇప్ప‌టికి రెండు సార్లు ఆయ‌నే అధ్య‌క్షుడిగా ఉన్నారు.

కీల‌క‌మైన విదేశాంగ వ్య‌వ‌హారాన్ని జిన్ త‌న క‌నుసైగ‌ల‌తో శాసిస్తున్నార‌నే వాద‌న ఉంది. అమెరికాకు చెక్ పెట్ట‌డం.. భార‌త్‌ను త‌న‌దారిలోకి తీసుకురావ‌డం అనే అజెండాతో జిన్ ముందుకు సాగుతున్నారు. దీంతో భార‌త్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిహ‌ద్దులు కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తూనే ఉంది. అయితే.. జిన్ ఈద‌ఫా ఇక అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గుతార‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంచ‌నాలు వ‌చ్చాయి.

కానీ, అనూహ్యంగా జిన్ పింగ్ మూడోసారి కూడా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. మూడోసారి కూడా జిన్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు చైనా పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.  దీంతో చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ పదవీ కాలం మ‌రో ఐదేళ్లు పొడించిన‌ట్టు అయింది.  అత్యంత అరుదైన ఈ ఎన్నికతో.. మావో జెడాంగ్‌ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా జిన్‌ నిలిచారు.

వాస్తవానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్పింగ్ కొనసాగుతున్నారు. ప్ర‌స్తుతం జిన్ వ‌య‌సు 69 ఏళ్లు. అంతేకాదు.. ఒక వ్యక్తి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేశారు. దేశాధ్యక్ష ప‌ద‌వికి రెండుసార్లకు మించి పదవిలో ఉండకూడదని, 68 ఏళ్లు నిండిన తర్వాత పదవి విరమణ పొందాల్సిందేనని చైనా శక్తిమంతమైన నేత మావో జెడాంగ్‌ తర్వాత అధికారంలోకి వచ్చిన డెండ్‌ జియవోపింగ్‌ నిర్దేశించారు.

అయితే.. దీనిని కూడా తోసిపుచ్చి.. జిన్ అధ్య‌క్షుడు కావ‌డం గ‌మ‌నార్హం.  అయితే.. ఈ ప‌రిణామం.. కేవ‌లం భార‌త్‌-అమెరికాల‌ను దృష్టిలో ఉంచుకునే చైనా పార్ల‌మెంటు నిర్ణ‌యించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆయా దేశాల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల ధీర‌త్వం ఉన్న నేత‌గా జిన్ ఇటీవ‌ల కాలంలో బాగా ప్రాచుర్యం పొందారు. ఇక‌, జిన్ మూడోసారి ఎంపిక కావ‌డం ప‌ట్ల భార‌త్ ఆచి తూచి వ్యాఖ్యానించాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై ఇప్ప‌టికిప్పుడు స్పందించ‌రాద‌ని విదేశాంగ శాఖ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News