మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 2014 తర్వాత ఓ వెలుగు వెలిగారు. మహబూర్ నగర్ టీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన ఈయనను కేసీఆర్ అందలమెక్కించాడు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా చేశాడు. దీంతో కేసీఆర్ కు నమ్మినబంటుగా మారి జితేందర్ రెడ్డి అన్నీ చేశాడు. కానీ 2019లో జితేందర్ రెడ్డికి కనీసం ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ పక్కనపెట్టేశాడు. ఇదే అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
కేసీఆర్ తనను ఎందుకు దూరం పెట్టాడన్న రహస్యాన్ని తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈయన కేసీఆర్ గురించి చెప్పిన సీక్రెట్ హాట్ టాపిక్ గా మారింది.
తాను కేసీఆర్ ఏం చెబితే అది చేశానని.. ఒక గొర్రెలాగా పనిచేశానని.. గొర్రెలాగా తల ఊపానని.. అయినా ఆయన నన్ను నమ్మలేదని జితేందర్ రెడ్డి వాపోయారు. నన్ను పులిగా భావించి టికెట్ ఇవ్వలేదని జితేందర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడీ మాటలు సంచలనంగా మారాయి. తాను మరోసారి పార్లమెంట్ లో అడుగుపెడితే ఆయనను మించిపోతాననే భయంతోనే తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.
కేసీఆర్ నమ్మని జాబితాలో చాలా మంది ఉన్నారని.. తనతోపాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇలా చాలా పెద్ద జాబితానే ఉందని జితేందర్ రెడ్డి బాంబు పేల్చారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక కేసీఆర్ పూర్తిగా మారిపోయాడని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేసీఆర్ గొప్ప మేధావి అని.. అంతలా అపార విషయ పరిజ్ఞానం ఉన్న నేతను తాను చూడలేదని జితేందర్ రెడ్డి చివర్లో ప్రశంసించడం విశేషం. బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే తాను సిద్ధంగా ఉన్నానంటూ ముగించడం విశేషం.