సంచలన వార్తలతో నిత్యం వార్తల్లో నిలిచే ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) మరోమారు అదే తరహ పరిణామంతో తెరకెక్కింది. అయితే ఈ దఫా విద్యార్థుల ప్రవర్తన కారణంగా కాకుండా...విద్యార్థిపై జరిగిన సంఘటన ఆధారంగా జేఎన్ యూ జనం దృష్టిని ఆకర్షించింది. జేఎన్ యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి ఖాలిద్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ పరిణామం పార్లమెంటు సమీపంలో జరగడంతో దేశ రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంట్ సమీపంలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో యునైటెడ్ అగైన్ స్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించిన ఖౌఫ్ కే ఆజాది అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖాలిద్ అక్కడికి వచ్చాడు. ఈ సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఖాలిద్ పై కాల్పుల ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి వివరించారు. ``మేం ఓ టీ స్టాల్ దగ్గర నిలబడి ఉన్నాం. ఆ సమయంలో వైట్ షర్ట్ వేసుకొన్న ఓ వ్యక్తి వచ్చి అతన్ని కిందికి నెట్టేసి కాల్పులు జరిపాడు. ఖాలిద్ కిందపడిపోవడంతో బుల్లెట్ అతనికి తగల్లేదు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాం. కానీ అతడు గాల్లో కాల్పులు జరుపుతూ వెళ్లాడు. తర్వాత ఓ చోట తుపాకీ కింద పడిపోగా.. అతడు మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు`` అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు.
కాగా, ఈ దాడి తర్వాత ఖాలిద్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశంలో ఓ భయానక వాతావరణం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను బెదిరిస్తున్నారు అని ఖాలిద్ అన్నాడు. గత జూన్ నెలలోనే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఖాలిద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు పార్లమెంటుకు అత్యంత సమీపంలోని హైసెక్యూరిటీ జోన్ లో స్వాతంత్య్ర దినోత్సవాలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం సంచలనం రేపింది.