ట్రంప్ పెట్టిన హెచ్1బీ వీసా బ్యాన్ ముగిసింది.. భారతీయులకు గుడ్ న్యూస్

Update: 2021-04-01 08:18 GMT
అమెరికన్లకు మాత్రమే ప్రయోజనం కలిగించటం.. మిగిలిన వారిని ఏదోలా ఇబ్బందులకు గురి చేసిన ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించిన గడువు తాజాగా ముగిసింది. హెచ్1బీ సహా ఇతర నాన్ ఇమ్మిగ్రేంట్ వర్కు వీసాలపై విధించిన బ్యాన్ మార్చి 31 అర్థరాత్రితో ముగిసింది. ఈ నిషేధాన్ని కొనసాగించేలా బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటం.. భారతీయులకు గుడ్ న్యూస్ గా మారిందని చెప్పాలి.

ఈ బ్యాన్ ను ఎట్టి పరిస్థితుల్లో తాము కొనసాగించమని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది.  కరోనా సంక్షోభం.. అనంతరం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికన్లకు భారీ నష్టం వాటిల్లుతుందన్న పేరుతో మాజీ అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1బీ వీసాతో పాటు నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కు వీసాలపై 2020 జూన్ లో బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీని ప్రభావం వేలాది మంది భారతీయుల మీదా.. వారి డాలర్ కలల్ని చెరిపేసింది. తొలుత డిసెంబరు 31, 2020 వరకు బ్యాన్ విధించి.. ఆ తర్వాత ఆ అంక్షల్ని మార్చి 31, 2021 వరకు కొనసాగించారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం..ఈ బ్యాన్ ను కొనసాగించమని చెప్పింది. తాజాగా ఆ గడువు ముగియటంతో.. భారతీయులకు భారీ ఊరటను ఇస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News