ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ కాలుకు స్వల్ప గాయమైంది. ఆయన తాను పెంచుకుంటున్న కుక్కలతో ఆడుతున్నప్పుడు స్వల్పంగా గాయపడ్డారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా పాదానికి స్వల్పంగా పగులు ఏర్పడ్డట్టు వైద్యులు గుర్తించారు. కొంతకాలంపాటు ఆయన రెస్ట్‌లో ఉండనున్నారు. జో బైడెన్ పాదానికి సంబంధించిన ఎముకలకు వెంట్రుకమందం పగులు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే బైడెన్ కు కొన్ని వారాలపాటు రెస్ట్ అవసరమైని వాళ్లు సూచించారు. బైడెన్ కాలు బెనకడంతో ఆయనకు వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. ఆదివారం బైడెన్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు చికిత్స నందిస్తున్నారు.
ఎక్స్‌రే రిపోర్ట్‌లో ఆయన ఎముక విరిగినట్టు కనిపించలేదు. అయితే మరికొన్ని పరీక్షలు చేయగా ఆయన పాదంలోని ఎముకకు స్వల్ప పగులు ఉన్నట్టు గమనించామని వైద్యులు చెప్పారు. జో బైడెన్ కొంతకాలం పాటు వాకర్ సాయంతోనే నడిచే అవకాశం ఉన్నది. ఇటీవల జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చాలా కాలంపాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. అధికార బదలాయింపుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతానన్నారు.
కానీ కుటుంబసభ్యులు, రాజకీయ సలహాదారుల సూచనతో ఆయన వెనక్కి తగ్గారు. అధికార బదలాయింపునకు అంగీకరించారు. దీంతో ప్రస్తుతం ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ గాయపడ్డారు. అయితే జో బైడెన్‌కు ప్రస్తుతం ఇబ్బంది ఏమి లేదని.. అయనకు అయ్యింది చిన్న గాయమే కాబట్టి తొందర్లోనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పారు.