దేవినేని ఉమా వదిన ఎలా చనిపోయారు?

Update: 2017-06-29 11:06 GMT
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.  ఉమా రాజకీయ జీవితం ప్రారంభ దినాల గురించి ఆయన మాట్లాడారు. ఉమా తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ అనుకుంటున్నారని ఆయన అన్నారు.  ఉత్త మాటలు చెప్పే పిట్టల దొర ఉమా అంటూ ఏకి పడేశారు.
    
ఉమా అసలు ఇరిగేషన్ శాఖా మంత్రి కాదని, ఓ బ్రోకర్ అని తీవ్ర విమర్శలు చేశారు. దేవినేని బ్రోకరేజ్ చేస్తూ పెదబాబు - చినబాబుకు డబ్బులిస్తున్నారని ఆరోపించారు. మైలవరానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మంత్రి  అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి ఉమకు లేవని... జగన్ చంద్రబాబులా  వెన్నుపోటు రాజకీయాలు చేసే వ్యక్తి కాదని,  ప్రజల తరపున పోరాడే వ్యక్తి అని అన్నారు. పోలవరాన్ని సాధించింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కాదని.. చంద్రబాబు ఇంతకుముందు అధికారంలో ఉన్న కాలంలో ఒక్కసారి కూడా పోలవరం గురించి ఆలోచించలేదని అన్నారు. పోలవరంపై చర్చకు తాను సిద్ధమని..  ప్లేస్, టైం ఉమా చెబితే ఎక్కడైనా, ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతానంటూ ఆయన సవాల్ విసిరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News