లాక్ డౌన్: కరోనా విరాళాల కోసం శృంగార వీడియో

Update: 2020-04-30 01:30 GMT
లాక్ డౌన్ వేళ కొందరు క్రేజీ ఐడియాలతో కరోనా విరాళాలు సేకరిస్తున్నారు. అయితే బాధ్యత గల జర్నలిస్టు వృత్తిలో ఉండి ఒక మహిళ చేసి పని వైరల్ గా మారింది. 39 ఏళ్ల ‘ఎమ్మా వర్డీ’ ప్రస్తుతం ప్రఖ్యాత బీబీసీ లో ఐర్లాండ్ దేశ కరస్పాండెంట్ గా పనిచేస్తోంది. అద్భుతమైన పొలిటికల్ కథనాలు రూపొందిస్తుందామే.. చాలా సార్లు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు కూడా పొందరాు. డబ్లిన్ సిటీలో పాపులర్ జర్నలిస్టు ఆమె.

ఎమ్మా కొన్నాళ్లుగా ఆరోన్ ఆడమ్స్ అనే ఫుట్ బాలర్ తో సహజీవనం చేస్తోంది. అయితే కరోనాపై యుద్ధం చేస్తోన్న నేషనల్ హెల్త్ సర్వీస్ కు విరాళాల సేకరించే బాధ్యత తీసుకుంది. అయితే దానికి క్రేజీగా వ్యవహరించి విమర్శల పాలైంది.

ఎమ్మా తన బాయ్ ఫ్రెండ్ ఆడమ్స్ తో కలిసి ఓ స్ఫూఫ్ శృంగార వీడియో తీసింది. శృంగారంతో ఎంజాయ్ చేస్తున్న ఆ వీడయో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన వాళ్లంతా కరోనా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గంటల వ్యవధిలోనే మంచి రెస్సాన్స్ వచ్చింది.

అయితే బాధ్యతగల జర్నలిస్టుగా ఎమ్మా చేసిన పని బాగాలేదని బీబీసీ బాసులు హెచ్చరించడంతో ఆమె వీడియోను తొలగించక తప్పలేదు. ఈ వ్యవహారంపై బీబీసీ అధికార ప్రతినిధి హెచ్చరించడంతో ఎమ్మా పోస్టు చేసిన వీడియోను డిలీట్ చేసింది.

కరోనా విరాళాల కోసం ఓ మహిళా జర్నలిస్టు ఇలా శృంగార వీడియోను బాయ్ ఫ్రెండ్ తో తీయడం చర్చనీయాంశమైంది .. ఆ వీడియో వైరల్ గా మారింది.
Tags:    

Similar News