కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త పోస్టు పుట్టుకొచ్చింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడే రథసారథి. పార్టీ ఆవిర్భావం నుంచే అదే సంస్కృతి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట కొత్త పోస్టు పుట్టుకొచ్చింది. ఆ కొత్త పోస్టును బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్ నద్దా... అదేనండీ మనమంతా జేడీ నద్దాగా పిలుచుకునే నేతకు దక్కేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో భేటీ అయిన పార్టీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ వస్తున్న నద్దాకు... పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా - కేంద్ర మంత్రిగా - రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం మెండుగానే ఉంది. అంతేకాకుండా తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జీగా కీలక బాధ్యతలు భుజానికెత్తుకున్న నద్దా... ప్రతికూల వాతావరణం వీస్తుందన్న పరిస్థితి కనిపించినా.. ఏకంగా బీజేపీకి 62 ఎంపీ సీట్లు దక్కేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో నద్దాకు పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తే మరింత మేలు జరుగుతుందన్న భావన బీజేపీలో వ్యక్తమైంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమిత్ షా... ఇప్పుడు మోదీ కేబినెట్ లో హోం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఒకరికి ఒకే పోస్టు అన్న రూల్ బీజేపీలో బాగానే అమలవుతోంది కదా. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా చేరిన అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదా నుంచి తప్పించి.. ఆ ప్లేస్ లో నద్దాను నియమిస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే షా విషయంలో ఒకరికి ఒకే పదవిని పక్కనపెట్టేసిన కమలనాథులు.. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలను సాకుగా చూపించేశారు. అంతేకాకుండా 2019లో షా నేతృత్వంలో పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరచిందని - ఆ సెంటిమెంట్ ను అలాగే కొనసాగించాలని కూడా బీజేపీ తీర్మానించినట్లుగా సమాచారం. మొత్తంగా అమిత్ షాను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించకుండా... పార్టీ వ్యవహారాలను నడిపేందుకు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించిన బీజేపీ... ఆ పదవిలో నద్దాను నియమించేసిదన్న మాట.