కృష్ణా పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి - పవిత్ర స్నానాలు చేస్తున్నారు. వీఐపీ ఘాట్ లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రా ప్రభుత్వం ఆహ్వానించిన నాయకులూ - సినీరంగ ప్రముఖులు విజయవాడకు వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా సన్నానాలు చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినీ పుష్కర స్నానం చేశారు.
శుక్రవారం నాడు నాగార్జున సాగర్ సమీపంలో ఉన్న శివాలయం ఘాట్ దగ్గర ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అయితే, ఆమెని కొంతమంది భక్తులు గుర్తుపట్టి - జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు వచ్చారు అంటూ చుట్టుముట్టి కాస్త హడావుడి చేశారు. ఆమెని పలకరించారు. షాలినీతో కాసేపు మాట్లాడేందుకు మీడియా కూడా ప్రయత్నించింది. శివాలయం ఘాట్ వద్దని ఆమెని మీడియా చుట్టుముట్టగా, మాట్లాడేందుకు తిరస్కరించారు.
ఇంకోపక్క, జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పుష్కరాలకు రావాలంటూ తెలుగుదేశం సర్కారు సాదరంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా ఎన్టీఆర్ నీడ కూడా పార్టీ మీద పడకుండా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి! కానీ, అవన్నీ పక్కన పెట్టేసి ఉన్నట్టుంది జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కారు ఆహ్వానించడం చర్చనీయం అయింది. ఈ ఆహ్వానంపై జూనియర్ కూడా కాస్త పాజిటివ్ గానే స్పందించాడని చెప్పాలి. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో పుష్కరాల గురించి మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చే భక్తులకు మన తెలుగు సంప్రదాయం ఏంటో పరిచయం చేయాలని చెప్పాడు.