మామయ్య అన్న పిలుపూ... బాబు జూనియర్ ల ప్రేమానుబంధం

Update: 2023-01-11 10:40 GMT
మామయ్య అన్న పిలుపుతో చంద్రబాబునాయుడు పులకించిపోతున్నారు. నిజానికి ఆయన ఏమైనా వినని పిలుపా అది అంటే కానే కాదు. నందమూరి సోదరులు బాబుకు బావమరుదులు అయితే వారి కుమారులు కుమార్తెలు బాబుని మామయ్య అనే పిలుస్తారు. అలా ఒక బహు చక్కని కుటుంబ బంధని నారా నందమూరిల మధ్యన ఉంది.

అయితే మామయ్య అని ఎందరు అన్నా కూడా చంద్రబాబుకు అమితానందం కలిగించే ఆ పిలుపే వేరు. అదే జూనియర్ ఎన్టీయార్ మేనల్లుడు నుంచి మామయ్యా అని అనిపించుకుంటే ఆ ఆనందం వేరు. అది ఇన్నాళ్లకు సార్ధకం అయింది. ఇదివరకు జూనియర్ చంద్రబాబుని మామయ్యా అని పిలిచేవారు. వారి కుటుంబ బంధం అలాగే ఉంది.

కానీ మధ్యలో వచ్చిన రాజకీయాల వల్ల గ్యాప్ వచ్చిందని బయటకు అంతా అనుకుంటున్నారు. అందులో ఎంత నిజముందో తెలియదు కానీ చంద్రబాబు అంటే జూనియర్ కి అభిమానం అని మరోసారి రుజువు చేసుకున్నారు.  మామయ్య  థాంక్స్ అంటూ జూనియర్ పలికిన ఆ పలుకులు ఒక్క బాబునే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకే ఆనందం కలిగించాయి అని చెప్పాలి.

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే నాటు నాటు సాంగ్ కి గోల్డెన్  క్లబ్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. దాంతో చిత్ర బృందాన్ని దేశ ప్రధాని నుంచి ముఖ్యమంత్రి జగన్ నుంచి అంతా అభినందించారు. ఇక చంద్రబాబు కూడా కంగ్రాట్స్ చేస్తూ ట్వీట్ చేశారు. దాంతో బాబు ట్వీట్ కి జూనియర్ రీ ట్వీట్ చేశారు.

నిజానికి టోటల్ చిత్రబృందాన్ని కలుపుకుని చంద్రబాబు ట్వీట్ చేసినా ప్రత్యేకంగా జూనియర్   ఎన్టీయార్   థాంక్యూ మామయ్యా అంటూ రీ ట్వీట్ చేయడం మాత్రం రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. చంద్రబాబు పుట్టిన రోజున కానీ లేక జూనియర్ బర్త్ డే నాడు కానీ ఇలా ఒకరికి ఒకరు గ్రీట్ చేసుకున్న సందర్భాలు లేవు.

కానీ ఇపుడు సడెన్ గా జూనియర్ నుంచి చుట్టరికాలు కలుపుతూ ఆప్యాయంగా మామయ్యా అంటూ ట్వీట్ జూనియర్ నుంచి రావడంతో తెలుగు తమ్ముళ్ల సంతోషం పట్టరానిది  అవుతుంది. అఫ్ కోర్స్ ప్రధాని మోడీకి, సీఎం జగన్ కి కూడా జూనియర్ ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. కానీ ఇక్కడ  జూనియర్ చంద్రబాబుల మధ్య బంధం ప్రత్యేకమైనది. అందుకే ఈ రీట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే జూనియర్   ఎన్టీయార్  చంద్రబాబు త్వరలో భేటీ అవుతారు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా అయితే అదే నిజమంటూ ప్రచారం చేసి పారేసింది. దాన్ని కాస్తా నిజం చేసేలా జూనియర్ నుంచి రీ ట్వీట్ రావడం శుభ సంకేతంగా   అంతా భావిస్తున్నారు. జూనియర్ అమెరికా నుంచి రాగానే బాబుతో ఆయన భేటీ ఉంటుందా అంటే ఏమో అదే నిజం కావచ్చు అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశానికి మంచి రోజులు వస్తున్నాయని అందుకే ఇలా వరసబెట్టి సంఘటనలు జరుగుతున్నాయని అంతా అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News