ట్విస్ట్‌: జ‌డ్జి రిజైన్ కు హైకోర్టు రిజెక్ట్‌

Update: 2018-04-19 08:00 GMT
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ ఐఏ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నంగా మార‌టం.. కొన్ని రాజ‌కీయ‌పార్టీలు అసంతృప్తి  వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. జ‌డ్జిమెంట్ మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న కాసేప‌టికే  ఎన్ ఐఏ కోర్టు జ‌డ్జి ర‌వీంద‌ర్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇదో సంచ‌ల‌నంగా మారింది.

మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసులోని నిందితుల్ని నిర్దోషులుగా ప్ర‌క‌టించ‌టం వెనుక ఒత్తిళ్లు వ‌చ్చాయా?  ఈ క్ర‌మంలోనే జ‌డ్జి రిజైన్ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారా? అన్న సందేహాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలా ఉంటే.. జ‌డ్జి ర‌వీంద‌ర్ రెడ్డి రాజీనామాను హైకోర్టు కొట్టివేయ‌టంతో ఈ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లైంది.

జ‌డ్జి ర‌వీంద‌ర్ రెడ్డి రాజీనామాను హైకోర్టు రిజెక్ట్ చేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు విదుల‌కు హాజ‌ర‌య్యారు. మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసులో నిందితులుగా ఆరోప‌ణ‌లున్న వారి విష‌యం ప్రాసిక్యూష‌న్ స‌రైన ఆధారాలు చూపించ‌నందున కేసును కొట్టివేయ‌టంతో పాటు.. నిందితుల్ని నిర్దోషులుగా ప్ర‌క‌టించిన వైనం తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చిన కాసేప‌టికే జ‌డ్జి రాజీనామా చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. జ‌డ్జి రాజీనామాను హైకోర్టు తిర‌స్క‌రించ‌టం ఈ వ్య‌వ‌హారంలో కొత్త ట్విస్ట్ గా చెప్పక త‌ప్ప‌దు.


Tags:    

Similar News