మరోసారి స్టే ఇవ్వడానికి అసలు కారణం చెప్పిన న్యాయమూర్తి !

Update: 2020-02-01 04:10 GMT
నిర్భయ కేసు లో ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతం జరిగి దాదాపు గా ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా దోసులకి సరైన శిక్ష పడటంలేదు అని నిర్భయ తల్లి తో పాటుగా సాటి ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఉరి ఖాయం అనుకున్న ప్రతిసారి కూడా కోర్టు వారి స్టే ని పొడిగిస్తూ ..ప్రజలకి న్యాయ స్థానాలపై ఉండే కొంచెం నమ్మకాన్ని కూడా పోగొట్టేస్తున్నాయి. ఫ్రిబవరి 1 ఉదయం ఉరి శిక్ష ఖాయం అని అనుకున్న సమయంలో ...శుక్రవారం సాయంత్రం మరోసారి స్టే ఇచ్చి ...వారికీ శిక్ష ని ఆపేసారు.

ఈ ఉరిశిక్ష పై స్టే విధిస్తూ ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు కూడా తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన పాటియాలా హౌస్ కోర్టు .. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశం తోనే ఉరిశిక్ష ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపింది.

ఈ కారణంగానే నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరిశిక్ష పై స్టే విధించినట్లు తెలిపింది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్ జారీ చేసినట్టు తెలిపింది. నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముకేష్ సింగ్‌ కు చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే, మిగితా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మనదేశంలోని న్యాయ స్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణ శిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముకేష్ ఒక్కడినే ఉరి తీయడం సాధ్యం కాదు అని నిర్భయ దోషలు మరణ శిక్ష పై స్టే ఇచ్చిన సందర్భం గా జడ్జీ ధర్మేంద్ర రానా తెలిపారు.

అలాగే అయన మాట్లాడుతూ .. జైలు మాన్యువల్‌ లోని రూల్ 836 ప్రకారం.. ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినప్పుడు, ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పుడు ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరపున మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసినట్లయితే, ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మరోసారి స్టే పొడిగించినట్టు తెలిపారు.


Tags:    

Similar News