ప్రపంచాన్నే వణికించిన అసాంజెకు పిచ్చిపట్టిందా!

Update: 2020-09-24 01:30 GMT
వికీలీక్స్​తో యావత్​ ప్రపంచదేశాలనే గడగడలాడించిన అసాంజే ఇప్పడు దయనీయ స్థితిలో ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం బాగాలేదా? ఏ క్షణమైనా ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉందా? జైలులో తీవ్రమైన డిప్రెషన్​తో ఇబ్బంది పడుతున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజేను జైలులో దాదాపు 20 సార్లు ఇంటర్వ్యూ చేసిన సైక్రియార్టిస్ట్‌ కోపెల్మన్‌ వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

తనకు వింత శబ్దాలు, మ్యూజిక్‌ వినిపిస్తున్నాయని అసాంజే తనతో చెప్పాడని సైకియాట్రిస్ట్‌ మైఖేల్‌ కోపెల్మన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన భ్రమల్లో ఉన్నారని.. తీవ్రమైన డిప్రెషన్​ లక్షణాలు ఉన్నాయని ఆయన పరిస్థితి చూస్తుంటే.. ఏ క్షణమైనా ఆత్మహత్యకు పాల్పడవచ్చని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

అమెరికా సైన్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టి అగ్రరాజ్యంలో ప్రకంపనలు పుట్టించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే ప్రస్తుతం లండన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని గూఢచర్యలు కేసులు పెట్టిన అమెరికా.. అసాంజేను తమకు అప్పగించాలని బ్రిటన్​ను కోరుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఓల్డ్‌ బెయిలీ కోర్టులో జరిగిన విచారణలో అమెరికా ప్రతినిధి జేమ్స్‌ లూయిస్‌ కోపెల్మన్‌ను ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. అసాంజే మాటలను నమ్మలేమని.. విచారణను తప్పించుకొనేందుకే ఆయన ఇలా డ్రామాలు ఆడుతున్నారని జేమ్స్​ ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై అసాంజే సహచరి స్టెల్లా మోరిస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆసాంజే ఆత్మహత్య చేసుకుంటే నా జీవితం సర్వనాశనం అవుతుంది. నా కొడుకులిద్దరూ అనాథలవుతారు’ అని ఆమె పేర్కొన్నారు. అయితే అమెరికా ప్రభుత్వం పెట్టిన కేసు కనుక రుజువైతే అసాంజేకు 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అసాంజే సౌత్‌వెస్ట్‌ లండన్‌లో అత్యంత భద్రతతో కూడిన బెల్మార్స్‌ జైలులో ఉన్నాడు.
Tags:    

Similar News