అనధికార వర్గాల సమాచారం ప్రకారం, యూఎస్ తో పాటు ఎన్నో దేశాలకు చెందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసిమా వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ హైకోర్టులో తాజాగా వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆయన్ను అమెరికాకు అప్పగించవద్దని, అక్కడి పరిస్థితులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకునే ముప్పు తీవ్రంగా ఉందని అసాంజే తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే సుమారు పదేళ్ల కిందట అమెరికా సైన్యానికి చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.
దీంతో ఆయన గూఢచర్యానికి పాల్పడ్డారంటూ అగ్రరాజ్యంలో కేసు నమోదైంది. కాగా, వికీలీక్స్ అనే సంస్థను స్థాపించిన అసాంజే, ఎన్నో దేశాలకు చెందిన సమాచారాన్ని లీక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు దేశాలు అసాంజేపై అరెస్ట్ వారెంట్లను జారీ చేయగా, దాదాపు 7 సంవత్సరాలు లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందిన ఆయన, ప్రస్తుతం ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నారు. అమెరికా మిలటరీ సీక్రెట్లను దొంగిలించాడన్నది అసాంజేపై ఉన్న ప్రధాన అభియోగం. ప్రస్తుతం 49 ఏళ్ల వయసులో ఉన్న అసాంజే, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనపై ఉన్న కేసులు నిరూపితమైతే, యూఎస్ చట్టాల ప్రకారం, 175 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.