మీ బతుకుల కోసం ప్రాణం ఇస్తామని చెప్పే రాజకీయ నాయకుడి మాటలకు చేతలకు మధ్య తేడా ఎంతన్న విషయాన్ని చూపించాడు అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ. తాలిబన్ల చేతికి చిక్కకుండా.. వారితో పోరు సలపకుండా.. దేశాధ్యక్ష పీఠాన్ని వదిలేసి.. తన దారిన తాను పారిపోయిన వైనం ముందు నుంచి అనుకున్నదే అయినప్పటికీ.. వెళ్లే ముందు అతడి ‘ఘన కార్యం’ గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దేశం నుంచి జంప్ కావటానికి కొన్ని గంటల ముందే దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన ఈ మహానుభావుడు.. మీకేం ఫర్లేదన్న ధీమాను ఇచ్చాడు.
అందరిని నమ్మించినట్లే నమ్మించి.. తీరా సమయం చూసుకొని జంప్ అయిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాలిబన్ల చేతికి చిక్కి చిత్ర హింసలు అనుభవించటమో.. జైల్లో కూర్చోవటమో తప్పదన్న విషయాన్ని గుర్తించిన ఆయన తన దారిన తాను వెళ్లిపోయారు. వెళ్లిపోయే వేళలో.. భారీగా డబ్బును తీసుకెళ్లిన వైనం విస్తుపోయేలా చేస్తోంది. ఒక హెలికాఫ్టర్.. నాలుగు కార్లలో పట్టేంత ధనాన్ని తన వెంట ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నరు. మిగిలినది ఎక్కడ పెట్టాలో అర్థం కాక విడిచి పెట్టి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
ఇంతకీ ఇప్పుడాయన ఎక్కడ ఉన్నాడన్న విషయం మీద క్లారిటీ రావట్లేదు. దేశం విడిచి పారిపోయే ముందు ప్రజల సొత్తును భారీగా తీసుకెళ్లిన వైనంపై తాజాగా అఫ్గాన్ లోని రష్యా దౌత్యకార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఏ దేశానికి వెళ్లారన్న దానిపై స్పష్టత లేకపోవటం.. ఇప్పటివరకు ఘనీ తజికిస్థాన్ కు వెళ్లనున్నట్లుగా చెప్పినా.. ఆ దేశం అనుమతించకపోవటంతో ఒమన్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళతారని చెబుతున్నారు. ఇక.. ఆయన జంపింగ్ గురించి రష్యా దౌత్యకార్యాలయానికి చెందిన ప్రతినిధి ఒకరు ఘనీ గురించి ఆసక్తికర అంశాల్ని షేర్ చేసుకున్నారు.
ఘనీ గురించి తెలిసిందేమంటే ఆయన దేశాన్ని విడిచి వెళ్లే వేళలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లారు. నాలుగు కార్లను డబ్బుతో నింపేశారు. మరికొంత మొత్తాన్ని హెలికాఫ్టర్ లో సర్దారు. వాటిలో సరిపోకపోవటంతో మరికొంత మొత్తాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారంతోనే తానా వివరాల్ని వెల్లడించినట్లుగా సదరు దౌత్యాధికారి వెల్లడించారు. అయితే.. ఈ వార్తను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించటంలేదు. ఇదిలా ఉంటే.. కాబూల్ లోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాల్ని మూసేశారు.
రష్యా మాత్రం కొందరు అధికారుల్ని అక్కడే ఉంచేసింది. తాలిబన్లతో సంబంధాలకు మొగ్గు చూపుతున్న ఆ దేశం.. వారిని పాలకులుగా గుర్తించటానికి మాత్రం ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పేయటం గమనార్హం. ప్రజలు కష్టంలో ఉన్న వేళలో తన సుఖాన్ని చూసుకొని వెళ్లిపోయిన ఘనీ లాంటి పాలకులకు తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉంది.