సాధారణంగా తెలుగుదేశం పార్టీ నేతలు తమలో తమకు ఎన్ని తగాదాలున్నా బహిరంగ వేదికలపై కీచులాడుకోరు. నియోజకవర్గాల స్థాయిలో అలాంటి సందర్భాలు కనిపిస్తుంటాయి కానీ - టీవీ ఛానళ్ల చర్చావేదికల్లో తమ పార్టీకే చెందిన నాయకులపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం అరుదు. కానీ... తాజాగా టీడీపీ నేత - ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆ పార్టీకే చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రి ప్రాంతంలో జేసీ బ్రదర్స్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అయితే... దీనిపై పార్టీ నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో అంతా తెలిసే జరిగిందా అన్న అనుమానాలు జేసీ వర్గం నుంచి వినిపిస్తున్నాయి.
ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జూపూడి అక్కడ మాట్లాడుతూ... తనకు ఇటీవల వెళ్తే అనంతపురం జిల్లా యాడికి మండలం నుంచి దాదాపు 500 దళితులు వచ్చి ఫిర్యాదు చేశారని... వారు చర్చికి వెళ్తున్నందున వారికి ఎస్సీ సర్టిఫికేట్ కాకుండా బీసీ-సీ కింద సర్టిఫికేట్లు ఇస్తున్నారని చెప్పారు. దీనిపై అక్కడి తహశీల్దార్‌ను నిలదీయగా ఆయన జేసీ సోదరులను అడగమని చెప్పారని జూపూడి ఆరోపించారు.
చర్చికి వెళ్లినంత మాత్రాన దళితులకు బీసీ-సీగా కులధృవీకరణ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జూపూడి ప్రశ్నించారు. తాడిపత్రిలో జేసీ చెప్పిందే వేదంలా పరిస్థితి తయారైందన్నారు. దీని పై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని జూపూడి చెప్పారు. దీంతో ఈ వివాదం వెనుక ఇతర కారణేలేవో ఉన్నాయని.. జేసే బ్రదర్స్ పై అటాక్ మొదలవుతోందని.. దానికి ఇదే ప్రారంభమని అనంత రాజకీయాల్లో వినిపిస్తోంది.