ఆ ‘జ్జడి’ సుప్రీం ఆదేశాల్ని ‘లైట్’ తీసుకున్నారా?

Update: 2017-02-14 04:42 GMT
తన వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలిచిన కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణణ్ ధిక్కార ధోరణిని ప్రదర్శించారు. ఆయనపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని ఆయన లైట్ తీసుకోవటం గమనార్హం. కోర్టు ధిక్కారం కింద మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో కోర్టు ఎదుటకు వచ్చి వివరణ ఇవ్వండంటూ సుప్రీం ఆదేశాల్ని జస్టిస్ కర్ణన్ పట్టించుకోనట్లుగా వ్యవహరించిన వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. సుప్రీం ఎదుటకు హాజరు కాని ఆయన.. చివరకు తన తరఫు లాయర్ ను సైతం పంపకపోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మద్రాస్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయటంపై తనకు తాను స్టే ఇచ్చుకోవటం ద్వారా జస్టిస్ కర్ణన్ సంచలనం సృష్టించారు. ఆయన వైఖరిని పలువురు తప్పు పట్టిన వేళ.. ఆయన తీరుపై సుప్రీం వ్యాజ్యం నమోదైంది. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను కానీ. ఆయన తరఫు న్యాయవాదిని కోర్టుకు హాజరవ్వాలంటూ ఆదేశించింది. దీనికి స్పందనగా.. ఆయన కానీ ఆయన తరఫు న్యాయవాదులు కానీ కోర్టుకు హాజరు కాకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాను దళితుడ్ని కాబట్టి ఇబ్బంది పడుతున్నానని.. తన విషయమై పార్లమెంటులో చర్చించాలంటూ ప్రధానికి మోడీకి జస్టిస్ కర్ణన్ ఇటీవల లేఖ రాసినట్లుగా బయటకు వచ్చింది. ఈ లేఖలో ఆయన మరిన్ని ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. తన నుంచి వివరణ తీసుకోకుండానే చర్యలు చేపట్టారని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జి మీద చర్యలు తీసుకునే అధికారం మరో కోర్టుకు ఉండదని చెబుతున్న ఆయన.. సుప్రీం ఆదేశాల్లో ఎలాంటి లాజిక్ లేదని తేల్చేయటం గమనార్హం. ఏకంగా హైకోర్టు జడ్జే సుప్రీం ఆదేశాల్ని లైట్ తీసుకోవటం ఎంత మాత్రం మంచి పరిణామం కాదనే వాదన వినిపిస్తోంది. మరీ.. ధిక్కార ధోరణికి సుప్రీం ఏలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News