టాలీవుడ్ పై జ‌స్టిస్ ఎన్. వి. ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-05-14 05:11 GMT
తెలుగు సినిమా  ఖ్యాతి ఇప్పుడు ప్ర‌ప్రంచ వ్యాప్త‌మైంది. పాన్ ఇండియా కేట‌గిరిలో టాలీవుడ్ సినిమా  ఎంతో ఫేమ‌స్. ఇండియ‌న్  సినిమా లో టాలీవుడ్ నెంబ‌ర్ -2 స్థానంలో ఉంది.  బాలీవుడ్ కి పోటీగా నిలుస్తుంది. టెక్నిక‌ల్ గానూ తెలుగు సినిమా ఎంతో పైకి ఎదిగింది. కొత్త కొత్త టెక్నాల‌జీని అందిపుచ్చుకుని  ముందుకుసాగుతున్నారు. యువ  ప్ర‌తిభావంతులు టాలీవుడ్ లో రాణిస్తున్నారు.  స‌క్సెస్ ప‌రంగానూ టాలీవుడ్ కి మంచి  రేటింగ్  ఉంది.

`కేజీఎఫ్` ప్రాంచైజీ హిట్ తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ కూడా ఎంతో ఫేమ‌స్ అయింది. ఇలా సౌత్ లో రెండు ప‌రిశ్ర‌మ‌లు బాలీవుడ్ కి ధీటుగా నిల‌బ‌డ్డాయి. సౌత్ సినిమాల స‌క్సెస్ ని ఓర్వ‌లేని  కొంత మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు తెలుగు సినిమాపై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసారో తెలిసిందే. తెలుగు సినిమా స‌క్సెస్ ని జీర్ణించుకోలేక అసూయ‌తో కుళ్లిపోయారు. ఇంకా మూస‌లోనే ఉన్నారా? అన్న తీరున విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా తెలుగు సినిమాపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్. వి. ర‌మణ ఓ వేదిక సాక్షిగా  కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు రాసిన  నేను సినిమాకి రాసుకున్న ప్రేమ‌లేఖ` పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్. వి. ర‌మ‌ణ తెలుగు సినిమాపై  విమ‌ర్శ‌లు గుప్పించారు.

`ప్ర‌స్తుతం తెలుగు సినిమాలో స్వ‌ల్ప కాలిక వినోదం త‌ప్ప ఇంకేం ఉండ‌టం లేదు. తెలుగు సినిమాలు చూస్తూ కింద్ర స‌బ్ టైటిల్స్ చ‌దివి అర్ధం చేసుకోవాల్సిన ప‌రిస్థితి వచ్చింది. ఇది ఎంతో దుర‌దృష్ట క‌రం. తెలుగు సినిమాని ఇంకా ద‌య‌నీయమైన స్థితిలోకి నెట్టోదు. తెలుగు భాష‌ని కాపాడండి...తెలుగు సినిమా గొప్ప‌ద‌నాన్ని చాటండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఎన్. వి. ర‌మ‌ణ తెలుగు వారు అన్న సంగ‌తి తెలిసిందే.  తెలుగు భాష అంటే ఎన‌లేని మ‌మకారం ఆయ‌న‌కు. అందుకే రాష్ర్ట  న్యాయ వ్య‌వ‌స్థ‌లో తెలుగు కు ఎంతో కృషి చేసారు. అధికార భాషా సంఘంతో క‌లిసి సెమినార్ నిర్వ‌హించారు.

తెలుగు గ‌డ్డ‌పై పుట్టి ల ఇక‌ల్క‌డే ఒక్కో మెట్టు ఎదిగి సుప్రీంకోర్టు ప్ర‌ధాన  న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు  నిర్వ‌హిస్తున్నారు. 1996లో సుప్రీం చీఫ్ జ‌స్టీస్ ప‌ద‌వి చేప‌ట్టిన తొలి తెలుగు వారైన కోక సుబ్బారావు త‌ర్వాత మ‌ళ్లీ కొంత కాలానికి ఆ అవ‌కాశం తెలుగు బిడ్డైన  ఎన్. వి . ర‌మ‌ణ‌కు వ‌చ్చింది.
Tags:    

Similar News