ప్రధానమంత్రులు మాట్లాడటమే గొప్పగా అనుకునే దేశంలో.. నిత్యం ఏదో అంశం మీద మాట్లాడే ప్రధాని రూపంలో మోడీ తెర మీదకు వచ్చారు. నేరుగా కాకున్నా.. ట్విట్టర్ మాధ్యమంతో ట్వీట్స్ తో టచ్ లో ఉంటూ.. ఆయన తన అభిప్రాయాలు.. భావాల్ని నిత్యం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు.. స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమంతో సామాన్యుల్ని.. సెలబ్రిటీలను కదిలించిన ఆయన.. ఆర్థికంగా బలంగా ఉన్న వారు తమ గ్యాస్ రాయితీని వదులుకోవాలని పిలుపునివ్వటమే కాదు.. దానిపై భారీగా ప్రచారం నిర్వహించటం తెలిసిందే.
ఇప్పటికే వంట గ్యాస్ పై రాయితీ వదులుకునేందుకు పలువురు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల గ్యాస్ రాయితీ అంశాన్ని ప్రస్తావించటమే కాదు.. ప్రధాని మోడీ మాటతో తన గ్యాస్ రాయితీని వెనక్కి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు.
ధనిక వర్గాలు ఇలా చేయటం కారణంగా.. దేశంలోని మరింతమంది పేదవర్గాలకు రాయితీ మీద వంటగ్యాస్ లభిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని సెలబ్రిటీలు.. క్రీడాకారులు తమ వంటగ్యాస్ రాయితీని వదులుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. గ్యాస్ అసలు ధరను భరించగలిగే ఆర్థిక శక్తి ఉన్న ప్రతిఒక్కరూ వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ మాట చాలామందిపై ప్రభావం చూపుతుంది.