ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు రాజకీయాల్లోకి రావాలని ఉందట. అయితే.. ఏ పార్టీలోకి వస్తానన్నది మాత్రం ఆమె స్పష్టంగా చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ విజన్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఆయన ప్రాక్టికల్ గా లేకపోవడంతో నమ్మకం కుదరడం లేదని చెప్పేసింది. దీంతో గుత్తా జ్వాల దారెటు అన్నది తెలియాల్సి ఉంది. లేదంటే.. తనకు బాగా పరిచయస్థులైన అజారుద్దీన్ - మరో మాజీ మంత్రి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే జ్వాల కూడా చేరుతారేమో చూడాలి.
సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని ఉందని.. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని జ్వాల రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్ స్పీచ్ లు తాను చాలా సార్లు విన్నానని చెప్పిన ఆమె పవన్ విజన్ బాగుందని తెలిపారు. కానీ, దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ఆయన ఇబ్బందులు పడుతారనిపిస్తోందన్నారు. అధికారంలో ఉన్న వారు పవన్ కల్యాణ్ కు అడ్డుపడుతారనిపిస్తోందని.. కానీ ఆ పార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతానికి తనకు ఇంకా లేదని.. తనను తనలాగే చూసే పార్టీలోనే చేరుతానని చెప్పారు.
పనిలో పనిగా పుల్లెల గోపీచంద్ పై విమర్శలు గుప్పించారు. గోపీచంద్ తన విషయంలో సరిగా వ్యవహరించడంలేదని ఆరోపించారు. డబుల్స్‌ను గోపిచంద్ ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు. ప్రశ్నించిందుకు తనను టీంలో కూడా లేకుండా చేశారని గుత్తా జ్వాల ఆవేదన చెందారు. ప్రభుత్వానికి సంబంధించిన స్టేడియంలు చాలా ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల అకాడమీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తనకు రాజకీయాల్లో పవర్ చేతికి వస్తే ఇలాంటి పరిస్థితిని మారుస్తానని గుత్తా జ్వాలా చెప్పారు. సో... గుత్తా జ్వాల రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థమైంది కదా..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/