తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న వార్తలను బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఖండించింది. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని జ్వాల స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీలో చేరుతుందంటూ ఇటీవల ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై జ్వాల వివరణ ఇచ్చింది. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమే కానీ, ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పింది. జనసేన పార్టీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని జ్వాల తెలిపింది.
కాగా ముక్కుసూటిగా మాట్లాడే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల తాజాగా ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. డేటింగ్ కి తాను మద్దతిస్తానని చెప్పిన ఆమె....పెళ్ళికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని చెప్పేసింది. 15 ఏళ్ల వయసులో ఒకరితో అపొజిట్ సెక్స్ షేరింగ్ చేసుకోవడం సహజమేనని ఆమె పేర్కొంది. కేవలం దాని గురించి అబద్దాలు చెప్పే వారు మాత్రమే డేటింగ్ తప్పు అనే భావనను ప్రచారంలో పెట్టారని వ్యాఖ్యానించారు. ఇక తాను సింగిల్ గానే ఉన్నానని తెలిపిన గుత్తా.. తనని చేసుకోబోయే భర్త తన ఆలోచనలకు తగ్గట్టుగానే ఉండాలని, తన ఆలోచనల్ని గౌరవించాలని తెలిపింది. పెళ్లికిముందే తనని పూర్తిగా అర్థం చేసుకోవాలని, అప్పుడే తాను పెళ్ళి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/