యశస్వీ జైస్వాల్ పానీ పూరి అమ్మలేదన్న కోచ్

Update: 2023-05-02 16:46 GMT
పానీ పూరి అమ్మి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ పై వస్తున్న కథనాలను జైస్వాల్ చిన్న నాటి కోచ్ జ్వాలా సింగ్ ఖండించారు. ఇలాంటి కథనాలు సరికాదన్నారు.  యశస్వి జైస్వాల్ ఒకప్పుడు ఆజాద్ మైదాన్‌లో "పానీపూరీలు అమ్మి క్రికెటర్‌గా మారాడు అన్నది అవాస్తవం అన్నారు.అతడు పూర్తి శ్రమతో జాతీయ స్థాయికి ఎదిగాడని.. పానీ పూరి బండి పెట్టుకొని ఎప్పుడూ అమ్మలేదన్నాడు. పానీ పూరి విక్రయదారులకు సాయం చేసేవాడు అంతేనని తెలిపారు.

అతని చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ సోమవారం ఈ విషయాన్ని బయటపెట్టాడు. ముంబై ఇండియన్స్‌పై 62 బంతుల్లో 124 పరుగులు చేసిన జైస్వాల్, వెస్టిండీస్ - అమెరికాలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు భారత జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

గత రెండు సీజన్లలో జైస్వాల్ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ ఈసారి బాగా ఫేమస్ అయ్యాడు. దంచికొడుతున్నాడు. ఈక్రమంలోనే సెంచరీతో అందరి దృష్టిలో పడ్డాడు. అతను ముంబైలో జీవనోపాధి కోసం పానీపూరీలను విక్రయించాల్సి వచ్చిందనే కథనాలు చేశారు. పానీ పూరి అమ్మిన వ్యక్తి ఇప్పుడు భారత్ క్రికెట్ ను ఊపేస్తున్నారంటూ రాసుకొచ్చారు..

2013లో తన తండ్రి జైస్వాల్ ను నాకు అప్పగించినప్పటి నుంచి అతడికి ఏలోటు రాకుండా చూసుకున్నానని కోచ్ తెలిపారు."చాలా మంది పానీపూరి అమ్మకందారులు ఆజాద్ మైదాన్ దగ్గర తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు అతను సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు, వారికి కొంచెం సహాయం చేసేవాడు. అతను స్వయంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయలేదు. అతను పానీపూరీలు అమ్మడం  చేయలేదు. " అని కోచ్ తెలిపారు.
 
"నేను ముంబైలో స్థిరమైన జీవితాన్ని గడిపాను కాబట్టి, నేను అతనిని నా స్వంత కొడుకులా చూసుకున్నాను. 2013 తర్వాత, అతను కష్టపడాల్సిన సంఘటనలు జరగలేదు, నేను అతని మొదటి బ్యాట్ కాంట్రాక్ట్‌ను రూ. 40,000 కు ఇచ్చాను అని కోచ్ తెలిపారు.

అంతర్జాతీయ ఆటగాళ్ళు ఉపయోగించే బ్యాట్‌లను నేను అతడికి అందించానని...అతడికి పేదరికం పెద్దగా ఇబ్బంది పెట్టలేదని కోచ్ తెలిపారు.   ఒకసారి జైస్వాల్ ను నా సొంత ఖర్చులతో ఇంగ్లండ్‌కు పంపామని.. అతడి టెక్నిక్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నాడని తెలిపారు.
   
యశస్వి అండర్-19 స్థాయి నుంచే ప్రదర్శన ఇచ్చాడు. చాలా మంది కుర్రాళ్ళు వారి అండర్-19 ప్రపంచ కప్ తర్వాత ఒకటి లేదా రెండు సంవత్సరాలలో టీమిండియాలోకి ప్రవేశించారు. ఉదాహరణకు శుభమాన్ గిల్ లేదా పృథ్వీ షాలు ఇలానే ఎంట్రీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు క్రికెట్ సరిగ్గా ఆడకపోవడంతో యశస్వి జైస్వాల్ కెరీర్ కాస్త మందగించింది. ఈ సంవత్సరం ఐపీఎల్ లో దంచికొడుతూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు యశస్వి రెడీ అయిపోయాడు.

Similar News