బాలక్రిష్ణ తెలియదంట.? అవాక్కైన యాంకర్

Update: 2018-11-28 08:59 GMT
కేఏ పాల్.. మతబోధకుడు - ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితమే.. ఈయన మాట్లాడితే సీరియస్ గా అనిపిస్తుంటుంది కొందరికీ.. కానీ ఆ సీరియస్ డైలాగుల్లోనే కామెడీ వచ్చేస్తుంటుంది. అందుకే కేఏ పాల్ ప్రసంగాలంటే జనాలు చెవి కొసుకుంటారు. ఆయన అదో రకం స్లాంగ్ లో నేతలను దెప్పి పొడిచేలా మాట్లాడే మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా కేఎల్ పాల్ చిన్న పిల్లాడి మనస్తత్వం మరోసారి మీడియా సాక్షిగా బయటపడింది. తెలంగాణ ఎన్నికలకు ముందు వరకు ఎక్కడున్నారో తెలియదు కానీ సడన్ గా కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చారు.వచ్చే మేలో ఏపీ అసెంబ్లీ  - పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని పాల్ చెబుతున్నారు. పలు న్యూస్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ కామెడీ వ్యాఖ్యలు చేశారు. హీరో నందమూరి బాలక్రిష్ణ ఎవరో తనకు తెలియదంటూ ప్రశ్నించిన యాంకర్ ను అవాక్కయ్యేలా చేశారు. ఇప్పుడీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘బాలక్రిష్ణ తనకు తెలియదు.. అతను యాక్టర్ కదా.. నేను ఎప్పుడు ఆయన్ను కలవలేదు.. ఏదో ఎన్టీఆర్ - జయలలిత హిట్ అయినంత మాత్రాన ఆయన వారసులు కూడా హిట్ అవుతారనడుకోవడం పొరపాటు’ అని పాల్ బాలయ్యపై హాట్ కామెంట్ చేశారు. అలాగే కూకట్ పల్లి నుంచి ఎవరో సుహాసిని అంట.. అసలు ఆమెకు మాట్లాడ్డమే రావడం లేదని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.

ఇక ఏపీ సీఎం కుమారుడు - మంత్రి లోకేష్ ను ఏకిపారేశాడు కేఏ పాల్... ‘ఏమీ లేని.. అనుభవం లేని ఏపీ సీఎం కుమారుడు లోకేష్ కు మూడు మినిస్ట్రీలంట.. 30 మంది గన్ మెన్లంటా.. అసలు ఆయనకు మాట్లాడడమే రాదు.. ఏంటిది.?’ అంటూ పాల్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. నందమూరి హరికృష్ణ తెలియదని. ఆయన కూతురు సుహాసిని కూడా తెలియదంటూ కేఏ పాల్ కామెడీ చేశారు.

ఇక చిరంజీవిపై కూడా కేఏ పాల్ కామెంట్ చేశారు. చిరంజీవీ అంటే తనకు చాలా ఇష్టమని.. తన సోదరుడు 1983 నుంచి చిరంజీవి సినిమా చూడాలని కోరేవాడని.. కానీ తాను చిరు సినిమా ఇంతవరకూ చూడలేదని కేఏపాల్ కామెడీ చేశారు. కానీ ఆయన వీడియోలు చూశానన్నారు. టాలీవుడ్ లో నంబర్ 1 హీరో - నంబర్ 10 హీరో చిరంజీవియేనని.. అంతటి గొప్ప నలుడు రాజకీయాల్లోకి వస్తే 10శాతం ఓట్లు రాలేదని.. రెండంకెల సీట్లు రాలేదని.. వీళ్లు ఎంత అంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు.

కానీ తాను మాత్రం రాజకీయాల్లో రాణిస్తానని కేఏ పాల్ వివరణ ఇచ్చారు. తన ప్రజాశాంతి పార్టీ తరుఫున గ్రామానికి ఇద్దరి పాస్టర్లుంటారని.. కనీసం 100 మంది గ్రామానికి తమ సానుభూతి పరులున్నారని పాల్ వివరించాడు. వీరు ఓటేస్తే చాలు తాము రాజకీయాల్లో గెలుస్తామని పాల్ తెలిపారు. తనకు పరపతి - హోదా లేకపోతే 140 దేశాల్లో ఎలా మెయింటేన్ చేస్తున్నానని పాల్ వివరించారు. పాల్ మాట్లాడిన చాలా పొంతనలేని మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View



Tags:    

Similar News