టీజీ పిచ్చోడు..సొల్లుగాడు..కాళ్లు ప‌ట్టుకున్నాడు

Update: 2018-06-22 05:07 GMT
మామూలుగానే గులాబీ బ్యాచ్‌కి మాట‌ల తీవ్ర‌త ఎక్కువ. అలాంటిది ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌లో.. ఇష్టారాజ్యంగా మాట్లాడేయ‌టం.. అందునా త‌మ ఓటు బ్యాంక్ అనుకుంటున్న వారి విష‌యంలో సీమాంధ్ర‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం గులాబీ నేత‌ల‌కు ఎక్క‌డో కాలిన‌ట్లైంది.

అర్థం లేని వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చిన టీజీకి త‌గిన శాస్తి అన్న చందంగా తిట్ల‌తో క‌డిగిపారేశారు టీఆర్ ఎస్ నేత‌లు.కొంద‌రికి కొన్ని అర్హ‌త‌లు అస్స‌లు ఉండ‌వు. విభ‌జ‌న ఉద్య‌మ స‌మ‌యంలో అదే ప‌నిగా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా తెలంగాణ ఉద్య‌మ‌కారులు అదే ప‌నిగా టార్గెట్ చేసిన కొంద‌రు సీమాంధ్ర నాయ‌కుల్లో టీజీ వెంక‌టేశ్ ఒక‌రు.

తాను చెప్పే వాదంపై బ‌లంగా నిల‌బ‌డ‌టం మానేసి.. స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న పేరుతో వెళ్లిపోయిన ఆయ‌న తీరుతో టీజీ అస‌లు నైజం ఏమిట‌న్న‌ది ఆంధ్రా ప్రాంత వాసుల‌కు బాగానే అర్థ‌మైంది.

త‌న‌కు చేత‌కానిది చేత‌కాన‌ట్లుగా ఉండిపోయినా బాగుంటుంది. కానీ.. ఏదేదో చేసేద్దామ‌న్న‌ట్లుగా మాట్లాడేయ‌టం.. ఆయ‌న పుణ్య‌మా అని తెలంగాణ నేత‌లు సీమంధ్ర ప్ర‌జ‌ల్ని తిట్లు తిన‌టం ఉద్య‌మ‌కాలంలో అంద‌రికి అనుభ‌వ‌మే. గ‌త అనుభ‌వాల దృష్ట్యా అయినా.. ఆచితూచి మాట్లాడాల్సిన టీజీ.. అందుకు భిన్నంగా మాట్లాడ‌టంపై గులాబీ దండుకు కోపం వ‌చ్చింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ కు కేసీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. లేకుంటే తెలంగాణ‌లోని సెటిల‌ర్లు టీఆర్ ఎస్‌ కు ఓటు వేయ‌రంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీజీ వెంక‌టేశ్ పిచ్చోడంటూ ఎంపీ కేశ‌వ‌రావు అలియాస్ కేకే తీవ్ర వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు అదే ప‌నిగా నోటికి ప‌ని చెప్పే కేకే.. టీఆర్ ఎస్‌ లో చేరిన నాటి నుంచి ఆచితూచి మాట్లాడ‌టం నేర్చుకున్నారు.

అవ‌స‌ర‌మైన‌ప్పుడు మిన‌హా అస‌లు నోరు విప్ప‌ని కేకే సైతం టీజీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. టీజీని పిచ్చోడిగా అభివ‌ర్ణించిన కేకే అక్క‌డితో ఆగ‌లేదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రికి తెలుస‌ని.. ఉద్య‌మ వేళ‌లో తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడి ఆ త‌ర్వాత వ‌చ్చి కాళ్లు ప‌ట్టుకున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు.

టీజీపై కేకే తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తితే.. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని మ‌రో అడుగు ముందుకేసి.. ఆయ‌న‌వ‌న్నీ సొల్లు మాట‌లేన‌ని తేల్చేశారు. టీఆర్ఎస్ పార్టీ కానీ.. తెలంగాణ ప్ర‌భుత్వం కానీ.. సీఎం కేసీఆర్ కానీ ఎప్పుడైనా ఏపీ ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకంగా మాట్లాడారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తారా?  లేదా? అన్న విష‌యాన్ని తేల్చి చె్ప్పాలంటూ కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేసిన విష‌యాన్ని ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ గుర్తు చేశారు. అంతేకాదు..టీఆర్ ఎస్ ఎంపీ క‌మ్ కేసీఆర్ కుమార్తె క‌విత సైతం పార్ల‌మెంటులో ఏపీ ప్ర‌త్యేక హోదాకి మ‌ద్ద‌తుగా త‌న గ‌ళాన్ని వినిపించిన వైనాన్ని గుర్తు చేశారు. టీజీ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన టీఆర్ఎస్ నేత‌ల వైఖ‌రి చూస్తే.. ఒక్క‌టిమాట ఖాయ‌మ‌నిపించ‌క‌మాన‌దు. తెలంగాణ‌లో మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని సీమాంధ్ర ప్రాంత మూలాలున్న ఓట‌ర్ల మీద భారీ ఆశ‌లే పెట్టుకున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఈ కార‌ణంగానే టీజీ చేసిన వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా రియాక్ట్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News