కేకేకు ఇప్పుడ‌ది మురికి ఒప్పందమ‌ట‌

Update: 2017-06-15 03:51 GMT
ప్ర‌భుత్వ భూముల్ని కొనుగోలు చేశార‌న్న మర‌క ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత కేకే ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా భూ వివాదంలో చిక్కుకున్న ఆయ‌న తాజాగా స‌ద‌రు వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది.

న‌గ‌ర శివారు హ‌ఫీజ్ పూర్ లో కొనుగోలు చేసిన భూములు వివాదంలో చిక్కుకోవ‌టం.. ఈ ఉదంతం టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మార‌టం.. ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోవ‌టంతో కేకే అలెర్ట్ అయ్యారు. అధినేత ఇచ్చిన ఆదేశాలో.. స‌ల‌హానో కానీ ఆయ‌న భూ వివాదంపై రియాక్ట్ అయ్యారు. వ‌ర్గో గ్లోబ‌ల్ మీడియా లిమిటెడ్ సంస్థ ద‌గ్గ‌ర కొనుగోలు చేసుకున్న సేల్ డీడ్‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లుగా చెప్పారు కేకే.

తాను చెల్లించిన డ‌బ్బుల్ని వ‌డ్డీతో స‌హా ఇవ్వాల‌ని.. న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.సేల్ డీడ్ లావాదేవీల్ని ర‌ద్దు చేయాల‌ని కోర్టు నోటీసులు పంప‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అదో మురికి ఒప్పంద‌మ‌ని.. దాన్లో కొన‌సాగ‌లేమ‌ని.. సొంత ప్ర‌భుత్వం.. త‌మ అధినేత‌తో ఘ‌ర్ష‌ణ వైఖ‌రిని అవ‌లంభించే ఉద్దేశం త‌మ‌కు లేదంటూ ఆయ‌న వివ‌రించారు.

హ‌ఫీజ్ పూర్ లో త‌మ కుటుంబ స‌భ్యులు భూములు కొన‌టం వాస్త‌వ‌మ‌ని.. కోర్టు ఆదేశాల మేర‌కు వాటిని రిజిస్ట్రేష‌న్ చేశారు. అయితే.. ఈ భూములు త‌మ‌వేన‌న్న భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. దీనిపై మ్యుటేష‌న్ ప్ర‌భావం ఉండ‌ద‌ని.. ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ ఇష్యూలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు చెప్పిన‌ట్లుగా చెప్పారు.

తాను కొనుగోలు చేసిన భూములు వివాద‌ర‌హిత‌మైన‌వ‌ని అనుకున్నామ‌ని.. అలా కాని ప‌క్షంలో భూములు అమ్మిన వ‌ర్లో గ్లోబ‌ల్ మీడియా లిమిటెడ్ సంస్థ వారు తాము చెల్లించిన డ‌బ్బుల్ని తిరిగి చెల్లించాల‌న్నారు. త‌మ కుటుంబ ప్ర‌తిష్ట‌కు త‌గిలిన దెబ్బ‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్ర‌భుత్వ భూముల్ని కొనుగోలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల నుంచి.. త‌మ‌దేం త‌ప్పు లేద‌న్న‌ట్లుగా కేకే చేస్తున్న తాజా వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News