ఒక ప్రముఖ పాప్ బృందానికి ఊహించని షాక్ తగిలింది. షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లిన వారికి భారీ అవమానం ఎదురై.. స్వదేశానికి వెళ్లిపోయిన పరిస్థితి. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. ఉత్త అనుమానంతో పాప్ బృందాన్ని సెక్స్ వర్కర్లన్న అనుమానంతో అదుపులోకి తీసుకోవటమే కాదు.. ఎంత మొత్తుకున్నా 15 గంటల పాటు నిర్భందంలో ఉంచటంతో బెదిరిపోయిన వారు.. వెనువెంటనే స్వదేశానికి వెళ్లిపోయిన ఉదంతమిది. దక్షిణ కొరియాకు చెందిన ఓ పాప్ బృందానికి అమెరికాలో ఒక చేదు అనుభవం ఎదురైంది.
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ సంగీత బృందం ‘‘ఓ మై గర్ల్’’. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లోని ఒక అల్బం షూటింగ్ కోసం వారు వెళ్లారు. విమానం దిగి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలోబృందంలోని యువతుల్ని విమానాశ్రయ అధికారులు నిర్భందించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. సెక్స్ వర్కర్లను తమ దేశంలోకి అనుమతించమని చెప్పటంతో వారు విస్తుపోయారు. తాము సెక్స్ వర్కర్లం కాదని.. పాప్ బృందమని చెప్పినా వారి మాటల్ని వినలేదు. దాదాపుగా వారిని 15 గంటల పాటు తమ అదుపులోనే ఉంచుకున్నపోలీసులు.. చివరకు వారికి సంబంధించిన ఆధారాలు చూపాక విడిచిపెట్టారు.
తమకు ఎదురైన చేదు అనుభవంతో సదరు పాప్ బృందం తమ దేశానికి వెళ్లిపోయింది. షూటింగ్ తో పాటు.. లాస్ ఏంజెల్స్ లోనే మరో కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే.. దాన్ని రద్దు చేసుకొని స్వదేశానికి చేరుకున్న వారు.. తమకు జరిగిన అవమానంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పేరుకు తగ్గట్లే.. విదేశీయుల్ని తలతిక్కగా అవమానించటంలోనూ అగ్రరాజ్యమనే విషయం అమెరికా అధికారులు నిరూపించారని చెప్పాలి.