ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని వ్యూహాత్మకంగా పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం...ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కొద్ది కాలంగా ఊరిస్తూ వస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న ఏపీ వాసి - పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రయోజనాల గురించి ఏకరువు పెడుతుంటారు. ఏపీకి ఎంతో చేశామని చెప్పుకొస్తుంటారు. అయితే దీనిపై ఇపుడు వెంకయ్యకు ఘాటు సవాల్ ఎదురైంది.
వెంకయ్యనాయుడు ఎంతో చేసినట్లు చెప్పుకోవడం కంటే కేేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలయిన నిధుల గురించి అఖిలపక్ష సమావేశంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సవాల్ విసిరారు. విభజన బిల్లులోని అంశాల కంటే రాష్ట్రానికి ఎక్కువే చేశామని వెంకయ్య గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర లోటు బడ్జెట్ ను పూడ్చేందుకు ఎన్ని నిధులు ఇచ్చారు? పోలవరం ప్రాజెక్టు - ఉత్తరాంధ్ర - రాయలసీమల అభివృద్ధికి ఎంతమేర నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. రైల్వే జోన్ విషయంలో విజయవాడ - విశాఖ ప్రాంతాల మధ్య వెంకయ్యనాయుడు చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రకటించిన పంటల బీమా పథకాన్ని సర్వే నంబర్ యూనిట్ గా అన్ని పంటలకూ వర్తింపజేయాలని కోరారు.
తానెంతో చేసానని చెప్పుకొనే వెంకయ్య నాయుడు ఇపుడీ సవాల్ కు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.