కేఏ పాల్ నోరు తెరిస్తే అతిశయోక్తులే ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ నా ఫ్రెండు.. పుతిన్ తో రోజూ మాట్లాడుతుంటా.. ఫలానా దేశంలో ఆ పార్టీని గెలిపించింది నేనే.. ఇలా ఉంటాయి పాల్ మాటలు. కొన్నేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన పాల్.. ఈ మధ్య మళ్లీ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ భద్రతా దళాలకు చిక్కిన 22 మంది శ్రీకాకుళం మత్స్యకారుల్ని స్వస్థలానికి రప్పించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడతానని పాల్ వ్యాఖ్యానించాడు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడతానని పాల్ అన్నాడు.
పాక్ అధ్యక్షుడిగా ఇమ్రాన్ గెలిచినప్పుడు తాను నార్వే నుంచి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని పాల్తె చెప్పాడు. తాను నేరుగా పాకిస్తాన్ కూడా వెళ్లగలనని.. త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తానన్నాడు. 22మంది మత్సకారుల విడుదలకు ఎంతైనా కృషి చేస్తానని.. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటానని చెప్పాడు.
విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 50 శాతం రైతుల రుణ మాఫీ చేస్తామని.. ఐదేళ్లలో 100 శాతం చేస్తామని.. రాష్ట్రానికి ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు.. పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తానని పాల్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతోందని.. గతంలో తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పానని.. ఆంధ్రలోనూ అదే జరగబోతోందని పాల్ అన్నాడు. తమతో ఎవరు కలిసి వచ్చినా పనిచేయడానికి సిద్ధమని... వివిధ పార్టీల నాయకులను తాము ఆహ్వానిస్తున్నామన్నాడు.
Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?