ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మతగురువు కేఏ పాల్ అతి త్వరలో హైదరాబాద్ వస్తున్నాడట. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లను అమ్ముకోవద్దని .. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ ప్రజలంతా కులాలకు, మతాలకు అతీతంగా ఓట్లు వేయాలన్నారు. తొందర్లోనే తాను హైదరాబాద్ వస్తున్నా.. అని పాల్ చెప్పారు. మరోవైపు పాల్వస్తున్నానని ప్రకటించడంతో సోషల్‌మీడియాలో అప్పుడే ఫుల్ ట్రోలింగ్ మొదలైంది. పాల్ హైదరాబాద్‌కు వస్తే న్యూస్చానళ్లకు ఫుల్ మసాలా దొరుకుతుందని.. తెలుగురాష్ట్రాల ప్రజలకు కావల్సినంత కామెడీ ఉంటుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
గత ఎన్నికల్లో కేఏపాల్, బండ్ల గణేశ్ లాంటి నేతలు రాజకీయాల్లోకి వచ్చి తెలుగువాళ్లకు కావల్సినంత వినోదాన్ని పంచారు. కేఏపాల్ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. అయితే ఆయనకు ఎక్కడా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.కానీ.. తన మాటలు, చేష్టలతో ప్రజలకు కావల్సినంత వినోదాన్ని పంచారు. ఇప్పటికే ఆయన వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అందుకు కారణం ఆయన చేసే కామెడీనే. ఓ మతగురువైన కేఏ పాల్.. సోషల్‌మీడియా దెబ్బకు కామెడీ పీస్‌గా మిగిలిపోయారు. ఇటీవల అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినప్పటికీ గద్దె దిగేందుకు ఇష్టపడలేదు. ఈ సందర్భంగా తానే ట్రంప్ దగ్గరకు వెళ్లి ఆయనను ఒప్పిస్తానని.. త్వరలోనే అధికార మార్పిడి జరుగుతుందంటూ పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తనకు 130 దేశాల అధ్యక్షులు తెలుసని వారందరితో నేను తరచూ మాట్లాడతానని పాల్ చెబుతుంటారు. తన పీస్ మిషన్ ఇండియాలోకి రాకుండా కొన్ని శక్తులు ఆపుతున్నాయని కూడా పాల్ తరుచూ అంటుంటారు. ఆయన మాటల్లోని నిజానిజాలు ఆ జీసస్కే తెలియాలి. ఏది ఏమైనా కేఏ పాల్ పేరు చెబితేనే పగలబడి నవ్వేవాళ్లు తెలుగునాట చాలామంది ఉన్నారు. ఇక ఆయన హైదరాబాద్‌కు ఎంట్రీ ఇచ్చారంటే మళ్లీ కామెడీ స్టార్ అయినట్టే.