తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబానికి శాపనార్థం హెచ్చరిక చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తను స్వామీజీల కన్నా పవర్ ఫుల్ అంటూ.. ఈయన కేసీఆర్ ఫ్యామిలీకి శాపనార్థం హెచ్చరిక చేశారు. తనే గనుక శపించానంటే.. కేసీఆర్ కుటుంబం మసి అవుతుందని ఈయన చెప్పుకొచ్చాడు!
ఒక మత ప్రబోధకుడు కూడా అయిన కేఏ పాల్.. ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. శపిస్తా.. మట్టి గొట్టుకుపోతారని.. ఈయన అంటున్నారు. ఇదేనా మతం చెప్పేది? కేసీఆర్ నమ్ముకున్న స్వామీజీల కన్నా తను పవర్ ఫుల్ అని ఈయన చెప్పుకురావడం మరో కామెడీ.
ఒక సీరియస్ అంశం గురించి ఇలా సిల్లీగా స్పందించారు కేఏ పాల్. తెలంగాణలో చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఇలా స్పందించాడు కేఏ పాల్.
విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో పాల్ స్పందించడం వరకూ ఓకే కానీ - ఇలా శాపాలు అంటూ మాట్లాడటం మాత్రం విడ్డూరం. ఇక రొటీన్ గా తను ప్రపంచాన్ని శాసించిన విషయాన్ని కేఏ పాల్ మరోసారి చెప్పుకొచ్చారు. అంతే కాదట తన ఆశీర్వాదం వల్లనే కేసీఆర్ తెలంగాణను సాధించారట. ఇదీ కథ.
కేటీఆర్ కు ప్రత్యేకంగా హెచ్చరికలు చేశారు పాల్. కేటీఆర్ కు డబ్బుంటే ఉండొచ్చని తనతో పెట్టుకోవద్దని కేఏ పాల్ హెచ్చరించారు. తనతో పెట్టుకుంటే శపించడమే అని తేల్చేశాడు.
ఇదే ఊపులో ఏపీ రాజకీయాల విషయంలో కూడా కేఏ పాల్ స్పందించేశాడు. ఇందులో బీభత్సమైన కామెడీ ఉందండోయ్. మే ఇరవై మూడున రాబోతున్న ఫలితాలతో తను ఏపీ రాజకీయంలో చక్రం తిప్పబోతున్నట్టుగా పాల్ చెప్పుకొచ్చాడు. ఏపీ సీఎంగా ఎవరు ఉండాలో డిసైడ్ చేసేది తనే అని ఆయన తేల్చేశాడు. తన పార్టీకి వందకు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పుకొచ్చాడు. జగన్ కూడా వచ్చి తనతో కలవాలని - చంద్రబాబుకు రిటైర్మెంట్ ను ఇచ్చేయడానికి తనకు సహకరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చాడు.
తన పార్టీకి వందకు మించి కూడా సీట్లు వచ్చేవట. అయితే తనకు ఈసీ హెలీకాప్టర్ సింబల్ ఇచ్చిందని - ఈవీఎంల మీద ఫ్యాన్ సింబల్ ఉందని.. దీంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కొంతమంది ఫ్యాన్ సింబల్ కు ఓటేశారని.. అందుకే తన పార్టీకి కొన్ని సీట్లు తగ్గే పరిస్థితి ఉందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు! మొత్తానికి నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత దటీజ్ కేఏ పాల్!