కరోనాకు ప్రకృతి మందు కనిపెట్టానని ప్రకటించిన కృష్ణపట్నం ఆనందయ్యకు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. ఇవాళ ఆనందయ్య బంధువులతో ఫోన్ లో మాట్లాడినట్టు చెప్పారు. ఆనందయ్య కరోనా మందు దేవుడు ఇచ్చిన వరమని చెప్పిన పాల్.. ఆ మందును, దాన్ని తయారు చేసిన ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆనందయ్య మందుతో ఎలాంటి హానీ లేదని ఆయుష్, ఐసీఎంఆర్ నిపుణులు చెప్పారన్న పాల్.. అయినప్పటికీ ఆయన్ను ఎందుకు నిర్బంధంలో ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇక, కరోనాపై ఆనందయ్య సాగిస్తున్న పోరులో తాను భాగం కాబోతున్నట్టు చెప్పారు పాల్.
ఈ మందు గురించి రాష్ట్రంలో ప్రజలకు వివరించబోతున్నట్టు తెలిపారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. ఈ మందుకు ఎలాంటి వస్తువులు కావాలో.. ప్రజలు స్వయంగా ఎలా తయారు చేసుకోవొచ్చో తాము సూచిస్తామని చెప్పారు. మందు తయారీ గురించి శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. నేర్చుకోవాలని భావించే వారు ‘‘ డాక్టర్ కేఏ పాల్ సేవ్ ఇండియా’’ వెబ్ సైట్ లో జాయిన్ కావాలని సూచించారు.
చాలా ఆసుపత్రులు కరోనా పేరుతో జనాన్ని దోచుకుంటున్నాయన్న పాల్.. తన తల్లి 20 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలు తల్లి కూడా కరోనాకు బలయ్యారని, ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన చికిత్స లేకున్నా.. డబ్బులు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ మెడికల్ మాఫియాను అడ్డుకోవాలంటే.. ఆనందయ్య మందును అనుమతించాలని డిమాండ్ చేశారు.