నిన్న జరిగిన రాష్ర్టపతి ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లేసి చంద్రబాబుతో చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ పరువు తీసేలా తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. పొరపాటునో - గ్రహపాటునో ఇలా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ.. ఆ ఇద్దరిలో ఒకరు ప్రకాశం జల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కావడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది.
కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఎన్నికల్లో పొరపాట్లు చేయడంలో పెద్ద చరిత్రే ఉంది. ఆయన ట్రాక్ రికార్డులో తాజాగా రాష్ర్టపతి ఎన్నికల పొరపాటు కూడా చేరిపోయింది. దీంతో కదిరి బాబూరావుకు కన్ఫ్యూజన్ మాస్టర్ అన్న పేరు ఫిక్సయిపోయింది.
కదిరి బాబూరావు పేరు చెబితే 2009 ఎన్నికల్లో ఆయన చేసిన పొరపాటును ఇప్పటికీ చెబుతుంటారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబూరావు నామినేషన్ వేశారు. అయితే... నామినేషన్ పత్రాలను సంతకం చేయకుండానే ఇచ్చేశారు. దీంతో బాబూరావు నామినేషన్ చెల్లుబాటు కాలేదు. అంతేకాదు.. ఆయన నామినేషన్ వేసినప్పుడు కనీసం డమ్మీ అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించలేదు. దీంతో అక్కడ టీడీపీకి కనీసం వేరే అభ్యర్థి కూడా లేకుండా అయిపోయింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్ధతునివ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిచారు.
కొసమెరుపు: ఎన్నికల్లో అవగాహన లేకుండా తప్పులు చేసే కదిరి బాబూరావు... సీఎం చంద్రబాబు బావమరిది - సినీ హీరో బాలకృష్ణకు అత్యంత సన్నిహిత మిత్రుడు. టీడీపీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాలయ్య సిఫార్సుల జాబితాలో ఫస్టు పేరు ఎప్పుడూ బాబూరావుదే ఉంటుందట.
బాలయ్యపై సోషల్ మీడియాలో - బయట ఎలాంటి సెటైర్లు పడుతుంటాయో తెలిసిందే కదా.. బాబూరావుపైనా అలాగే సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ ఒకరిని మించినవారు ఒకరంటూ సరదా విమర్శలు చేస్తున్నారు.