టీఆర్ ఎస్‌ లో సీన్ రివ‌ర్స్‌..

Update: 2019-08-23 05:06 GMT
బండ్లు ఓడ‌ల‌వుతాయి.. ఓడ‌లు బండ్లు అవుతాయి..! టైం మ‌రి..! ఎప్పుడు ఎవ‌రిని ఎలా మారుస్తుందో.. ఎక్క‌డ కూర్చోబెడుతుందో చెప్ప‌డం క‌ష్ట‌మేరి. ఈ అనూహ్య మార్పుల‌ను ఎక్కువ‌గా రాజ‌కీయాల్లోనే చూస్తుంటాం మ‌నం. ఇప్పుడు అధికార టీఆర్ ఎస్‌ లో ఈ సీన్ క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రు సీనియ‌ర్‌ నేత‌ల రాజ‌కీయ ప్ర‌స్తానం అనేక మ‌లుపుల‌తో కొన‌సాగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో ఒక‌రు డిప్యూటీ సీఎం హోదాలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో చక్రం తిప్పితే.. మ‌రొక‌రు ఎమ్మెల్యేగా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వంలో ఇందుకు పూర్తి భిన్నంగా దృశ్యం క‌నిపిస్తోంది. ఇంత‌రీ ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..?  వారు మ‌రెవ‌రో కాదు.. క‌డియం శ్రీ‌హ‌రి - ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు.

క‌డియం - ఎర్ర‌బెల్లి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఎదిగిన నేత‌లే. ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో క‌డియం శ్రీ‌హ‌రి మంత్రిగా కూడా ప‌నిచేశారు. అప్పుడు కేవ‌లం ఎర్ర‌బెల్లి ఎమ్మెల్యేగా కొన‌సాగారు. అయితే.. ఇక్క‌డ ఎర్ర‌బెల్లి మాత్రం వ‌రుస‌విజ‌యాల‌తో తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నేత‌గా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో క‌డియం శ్రీ‌హ‌రి టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లోకి వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ నుంచి టీఆర్ ఎస్ ఎంపీగా గెలిచారు.

ఇక పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎర్ర‌బెల్లి టీడీపీ ఎమ్మెల్యేగా క‌ష్టాతిక‌ష్టంగా గెలుపొందారు. ఆ త‌ర్వాత ఎర్ర‌బెల్లి కూడా అధికార టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. అప్పుడు తెలంగాణ మొద‌టి డిప్యూటీ సీఎం - స్టేష‌న్‌ ఘ‌న్‌ పూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజ‌య్య‌ను కొద్దినెల‌ల‌కే సీఎం కేసీఆర్ తొల‌గించి - ఏకంగా క‌డియంను డిప్యూటీ సీఎం చేశారు. నిజానికి.. అప్ప‌ట్లో ఇది పెద్ద సంచ‌ల‌న నిర్ణ‌యంగా మారింది. క‌డియంను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించి - ఎమ్మెల్సీగా ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. ఇక డిప్యూటీ సీఎం హోదా క‌డియం శ్రీ‌హ‌రి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొంత హ‌డావుడి చేశారు.

ఇక ఇదే స‌మ‌యంలో ఎర్ర‌బెల్లి మాత్రం కేవ‌లం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయ్యారు. మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుకూడా పెట్ట‌లేదు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయింది. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌బెల్లి భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ మొద‌టి మంత్రివ‌ర్గంలో ఎర్ర‌బెల్లి స్థానం సంపాదించారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఎర్ర‌బెల్లి ఒక్క‌డికే మంత్రి ప‌ద‌వి ల‌భించింది. ఇక ఇప్పుడు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆయ‌నదే హ‌వా న‌డుస్తోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్ప‌డిన ఆరు జిల్లాల్లోనూ ఎర్ర‌బెల్లిదే పెత్త‌నం. హైద‌రాబాద్‌ లోనూ స‌మీక్ష‌ల‌తో హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నారు.

ఉమ్మ‌డి జిల్లాలో ఏ కార్య‌క్ర‌మం జరిగినా ఎర్ర‌బెల్లి ముఖ్య అతిథిగా ఉండాల్సిందే. ఇక ఇదే స‌మ‌యంలో మాజీ డిప్యూటీ సీఎం - ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి ఎర్ర‌బెల్లి వెనుక సైలెంట్‌ గా నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి, ఆయ‌న కొంత అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీలోకి వెళ్లేందుకు క‌డియం సిద్ధంగా ఉన్నార‌నే టాక్ రావ‌డంతో ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అయినా.. ఆ ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. పార్టీ - ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో క‌డియం అంత చురుగ్గా ఉండ‌క‌పోవ‌డంతో ఆ ఊహాగానాలు మ‌రింత ఊపందుకుంటున్నాయి.

ఏదిఏమైనా.. తాను మంత్రి కావాల‌న్న ఎన్నో ఏళ్ల క‌ల‌ను నిజం చేసిన కేసీఆర్ వ‌ద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఎర్ర‌బెల్లి తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. క‌డియం మాత్రం ఎక్క‌డో దూరంగా విసిరేసిన‌ట్టు ఉండిపోతున్నారు. పాపం ఏంచేస్తాం మ‌రి.. ఇవీ రాజ‌కీయాలు!


Tags:    

Similar News