గుజరాత్ లో చావు తప్పి కన్ను లొట్టబోయింది. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు వెక్కిరించాయి.. కర్ణాటకలో పాచిక పారలేదు.. ఇప్పుడు దేశంలోని పది రాష్ట్రాల్లో జరిగిన నాలుగు పార్లమెంటు - 10 అసెంబ్లీ స్థానలకు జరిగిన ఉప ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది.. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలున్నాయనగా భారీ దెబ్బ తగిలింది.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు సహా అనేక చోట్ల ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మోదీ-షాల మాయాజాలం పనిచేయడం లేదన్న సత్యం దేశానికి బోధపడుతోంది. నాలుగేళ్లుగా నానా కష్టాలు పడుతున్న ప్రతిపక్షాలకు.. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలకు పండగ తీసుకొచ్చాయి ఈ ఫలితాలు.
తాజా ఉప ఎన్నికల్లో నాలుగు పార్లమెంటులో ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ గెలిచింది. మరో చోట బీజేపీ మిత్రపక్షం గెలిచింది. 10 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 9 చోట్ల బిజెపి ఓడిపోయింది. సిటింగ్ స్థానాలు కూడా కోల్పోవాల్సి రావడం బీజేపీకి నిజంగా షాకింగ్ న్యూసే. ఉత్తరప్రదేశ్ లోని కైరానా - మహారాష్ట్రలోని పాల్గర్ - భండారా-గోండియా - నాగాలాండ్ పార్లమెంటు స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి చతికిలపడింది. పైగా ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోక్ సభ స్ధానాల్లో 3 బీజీపీ స్థానాలు కాగా ఒకటి ఆ పార్టీ మిత్రపక్షం ఎన్డీపీపీది.
అసెంబ్లీ ఉప ఎన్నికల విషయం చూస్తే, ఇక్కడా బిజెపికి పెద్ద దెబ్బే తగిలింది. కర్నాటకలోని ఆర్ ఆర్ నగర్ నియోజకవర్గంలో, పాలన్ కడేగావ్-మహారాష్ట్రలో, మేఘాలయాలోని అంపతి లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. పంజాబ్ లోని షాకోట్ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి అకాలీదల్ అభ్యర్ధిపై గెలిచారు. షాకోట్ అకాలీదళ్ సిట్టింగ్ స్ధానం కావటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లోని నూర్పూర్ నియోజకవర్గంలో బిజెపికి ఊహించని పరాభవం ఎదురైంది. సిట్టింగ్ స్ధానాన్ని ఎస్పీ అభ్యర్ధికి వదులుకోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని మహేస్ధలలో టిఎంసి అభ్యర్ధి గెలిచారు. కేరళలోని చెంగన్నూరు నియోజకవర్గంలో సిపిఎం విజయం సాధించింది. బీహార్ లోని జోకిహాట్ నియోజకవర్గంలో అధికార కూటమిలోని జెడియుకి పరాభవం తప్పలేదు. ఇక్కడ ఆర్జెడియు అభ్యర్ధి గెలిచారు. ఇక, జార్ఖండ్ లోని గోమియా స్ధానంలో బిజెపి అభ్యర్ధి, సిలీ స్దానంలో జెఎంఎం అభ్యర్ధులు గెలిచారు. ఉత్తరాఖండ్ లోని థరేలీలో బిజెపి గెలిచింది. కేవలం రెండు చోట్ల మాత్రమే బీజేపీ గెలిచింది.
'ఉప ఎన్నికల్లో కైరానా నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ విపక్షాలన్నీ ఏకమై బీజేపీని దెబ్బకొట్టడంతో ఏమాత్రం ఎదురునిలవలేకపోయింది. విపక్షాల ఐకమత్యమే బీజేపీని ఎదుర్కోవడానికి సరైన మంత్రమని ఈ ఉప ఎన్నికలు నిరూపించాయి. కానీ.. ఉప ఎన్నికల్లో కనబరిచే ఐక్యత జనరల్ ఎలక్షన్లు వచ్చేసరికి సాధ్యమేనా అన్నది అసలు సమస్య.