ఎక్కడైనా ఫ్రెండ్స్ కానీ రాజకీయాల్లో మాత్రం కాదని ఇప్పటికే చాలాసార్లు ఫ్రూవ్ అయ్యింది. పైకి స్నేహితులం అని చెప్పుకున్నా కానీ రజనీకాంత్ - కమల్ హాసన్ మధ్య మొన్నటివరకు సినిమాల విషయంలో బీభత్సమైన పోటీ ఉండేది. ఇప్పుడు ఇద్దరు రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ పోటీ మొదలైంది. కమల్ హాసన్ ఆల్ రెడీ పార్టీ పెట్టేశాడు. రజనీకాంత్ మాత్రం స్లో అండ్ స్టడీ సూత్రాన్ని నమ్ముకున్నాడు.
త్వరలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో.. తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించాడు కమల్. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. కానీ రజనీ మాత్రం.. తమ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశాడు. తమ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని స్పష్టం చేశాడు. దీంతో.. రజనీకాంత్ పై ఘాటైన విమర్శలు చేశాడు కమల్. రజనీ ఒక పిరికివాడు అని అన్నాడు.
“ఒంటికి ఆయిల్ పూసుకుని - తొడలు కొట్టినప్పుడు కచ్చితంగా బరిలోకి దిగాలి. గెలిచో - ఓడో బయటకు రావాలి. కానీ నాకు ఇప్పుడు మూడ్ లేదు - రేపొస్తా - నీ అంతుచూస్తా అని సొల్లు కబుర్లు చెప్పకూడదు” అంటూ రజనీకాంత్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు కమల్ హాసన్. రజనీకాంత్ ఇప్పుడే కాదు.. ఎప్పూడూ సేప్ గేమ్ ఆడతాడని.. కాని తాను మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించాడు కమల్. ఇప్పటికే రజనీకాంత్ నిర్ణయంపై తమిళనాట కూడా విమర్శలు మొదలయ్యాయి. బీజేపీతో రజనీ కుమ్మక్కు అవ్వడం వల్లే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి.