రైతు బిల్లులకు మద్దతా? నిప్పులు చెరిగిన కమల్

Update: 2020-09-27 15:39 GMT
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో ఆమోదించిన రైతు బిల్లులకు తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలుపడాన్ని సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తప్పుపడుతూ నిప్పులు చెరిగారు. ఇది రైతులకు తమిళనాడు సర్కార్ ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ బిల్లులు రాష్ట్ర ప్రతివత్తిని నాశనం చేస్తాయని.. ధరలు అమాంతం పడిపోయి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రపతి ఈ రైతు వ్యతిరేక బిల్లులను తిప్పి పంపాలని.. వీటిపై సభలో చర్చ జరిగితేనే రైతులకు కొంత న్యాయం జరుగుతుందని కమల్  పేర్కొన్నారు. తనను తాను రైతుగా పేర్కొనే సీఎం ఫళని స్వామి ఈ బిల్లులకు ఎలా మద్దతిస్తున్నారని కమల్ హాసన్ ప్రశ్నించారు.

తమిళనాడులో వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో అన్నదాతలు ఈ ప్రభుత్వాన్ని మట్టిలో పూడ్చి పెట్టడం ఖాయం అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తన స్టేట్ మెంట్ ఇస్తున్న సందర్భంగా ఆయన ఈ బిల్లుల తాలూకు ప్రతులను చించి పోగులు పెట్టారు.

కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీ మిత్రపక్షం కావడంతో మద్దతుగా నిలుస్తోంది. అందుకే అన్నాడీఎంకేను కూడా వదలకుండా కమల్ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

    

Tags:    

Similar News