ఎంజీఆర్ ద‌గ్గ‌ర స్విమ్మింగ్ నేర్చుకున్నాడ‌ట‌!

Update: 2018-08-16 05:14 GMT
సెల‌బ్రిటీల‌కు ఉండే సౌల‌భ్యం అంతా ఇంతా కాదు. తాము నోరు విప్పాల‌నుకున్నా.. త‌మ మ‌న‌సుల్లో ఉన్న‌ది చెప్పాల‌న్నా వారికి బోలెడ‌న్ని మార్గాలు ఉంటాయి. అదే టైంలో తమ మాట ఎవ‌రికి వినిపించ‌కూడ‌ద‌నుక‌న్నా అది వారి చేతుల్లోనే ఉంటుంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా రియాక్ట్ కావ‌టానికి.. ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ప్ర‌చారం వ‌చ్చేలా చేసుకోవ‌టానికి ఇప్పుడున్న అవ‌కాశాలు అన్నిఇన్ని కావు.

ఈ విష‌యాన్ని గుర్తించిన ప్ర‌ముఖులు తాము కోరుకున్న ఇమేజ్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. విశ్వ క‌థ‌నాయుడిగా పేరున్న‌ క‌మ‌ల్ హాస‌న్ సంగ‌తే చూడండి. ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఆయ‌న న‌లుగురి నోళ్ల‌ల్లో నానేవారు కాదు. ఒక‌వేళ ఆయ‌న మీద గాసిప్పులు వ‌స్తేగిస్తే.. వ్య‌క్తిగ‌త‌మైన‌వో.. సినిమాకు సంబంధించిన అంశాలో ఉండేవి.

అలాంటి ఆయ‌న ఉన్న‌ట్లుండి సామాజిక అంశాల మీద స్పందించ‌టం షురూ చేశారు. అది కాస్తా.. చివ‌ర‌కు రాజ‌కీయ పార్టీ పెట్టే వ‌ర‌కూ వెళ్లింది. గ‌తంలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పెద‌వి విప్ప‌ని క‌మ‌ల్.. ఇప్పుడు ఏ సంద‌ర్భంలోనైనా.. ఆయ‌న ఆ విష‌యాల్నే తెర మీద‌కు తెస్తున్నారు. త‌న‌కు ల‌భించిన ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌టం లేదు.

తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూనే చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎంజీఆర్ వ‌ద్దే తాను ఈత నేర్చుకున్నాన‌ని చెప్పిన ఆయ‌న‌.. అప్పుడే రాజ‌కీయ ఈత కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకొని ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించ‌టం చూస్తే.. క‌మ‌ల్ హ‌స‌న్ చ‌తుర‌త ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎంజీఆర్ కు తాను శిష్యుడిన‌న్న అంశాన్ని త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేసిన తీరు చూస్తుంటే.. రాజ‌కీయాలు క‌మ‌ల్ హాస‌న్ ఒంటికి బాగానే ప‌ట్టాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదే ఇంట‌ర్వ్యూలో మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ సినిమాల్లో ప్ర‌తి పాత్ర స‌న్నివేశాల‌తో మ‌మేకం అవుతుంన్న ఆయ‌న‌.. ఒక పాత్ర మాట్లాడే స‌మ‌యంలో తాను న‌డుం మీద చేయి ఉంచుకొని నిల‌బ‌డితే.. బాల‌చంద‌ర్ కు న‌చ్చేది కాద‌న్నారు. ఏం స్టైల్ చేస్తున్నావా? ప‌్ర‌త్యేకంగా స్కోర్ చేద్దామ‌నుకున్నావా? అంటూ బాల‌చంద‌ర్ ప్ర‌శ్నించేవార‌ని గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయం దారిన రాజ‌కీయం చేస్తూనే.. మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమా ముచ్చ‌ట్లు చెబుతున్న క‌మ‌ల్ హాస‌న్ త‌న మాట‌ల‌తో అంద‌రి దృష్టి త‌న మీద ప‌డేలా చేస్తున్నార‌ని చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News