ఈ మధ్యన అసహనం ఎక్కువ అవుతోంది. ఎవరికి వారు ఏ చిన్న మాట అన్నా ఇష్టం వచ్చినట్లుగా స్పందిస్తున్న వైనం పెరుగుతోంది. ఒకరు ఒక వ్యాఖ్య చేశారంటే.. అందుకు ముందు వెనుకా అంశాల్ని పరిశీలించి స్పందిస్తే బాగుంటుంది. అంతేకానీ.. మాటకు మాటే సమాధానం అన్నట్లుగా వ్యవహరించటం ఏమాత్రం సరికాదు.
బీజేపీ నేతల తీరు చూస్తే ఇప్పుడు ఇలానే ఉంది. రాజకీయ పార్టీ పెట్టనున్నట్లుగా ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ మధ్యన కొన్ని వ్యాఖ్యలు చేయటంతోపాటు.. పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. అలా ఆయన రాసిన ఒక వ్యాసంలో దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందంటూ పేర్కొనటం సంచలనంగా మారింది. ఈ వ్యాసంలో కమల్ ప్రస్తావించిన విషయాల్ని చూసినప్పుడు అవును.. నిజమే అన్న భావన కలగటం ఖాయం.
ఉగ్రవాదం మాటను హిందువులకు ఎలా అపాదిస్తారన్నది కమలనాథుల ఆగ్రహంగా చెప్పాలి. కమల్ చేసిన మొత్తం వ్యాఖ్యను చదివారో లేరో కానీ.. హిందూ ఉగ్రవాదం అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. కమల్ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందించాలని కమలనాథులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కమల్ హాసన్ మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్న బీజేపీ నేతలు.. రాజకీయాలు ఇంతలా దిగజారటం మంచిది కాదన్నారు. ఆధారాలులేకుండా ప్రకటన చేయటం సరికాదంటూ బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమల్ చేసిన వ్యాఖ్యపై పరువునష్టం దావా వేసే అవకాశాన్ని తాము పరిశీలిస్తామన్నారు.
కమల్ పై కమలనాథులు ఇంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. వారిని అంతగా ఇబ్బందిపెట్టేలా కమల్ హాసన్ ఏం రాశారన్నది చూస్తే.. గతంలో హిందూ సంస్థలు హింసకు పాల్పడేవి కావని. .కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవని పేర్కొన్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని.. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నట్లుగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన కరెక్ట్ కాదన్న కమల్ హాసన్.. అందులో నిజం లేదని.. ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లుగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంంతో మండిపడుతున్నారు. మరి.. కమల్ వ్యాఖ్యలపై మీరేమంటారు?