హిందీ ప్రభుత్వం కాదు.. భారత ప్రభుత్వమిదీ: కమల్

Update: 2020-08-22 17:27 GMT
కేంద్ర ఆయూష్ శాఖ సెక్రటరీ రాజేశ్ కొట్టేచా తాజాగా వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతూ తమిళనాడు వైద్యుల నుద్దేశించి తాను ఇంగ్లీష్ లో మాట్లాడనని..  ‘హిందీ ’లోనే మాట్లాడుతానని.. రాని వారు వెళ్లిపోవచ్చని  అవమానించాడు. దీనిపై తమిళనాట దుమారం చెలరేగింది. ఇప్పటికే డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వంలో హిందీ జాడ్యంపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిప్పులు చెరిగారు. హిందీ ప్రభుత్వం కాదని.. భారత ప్రభుత్వం దేశంలో ఉందని గట్టిగా కౌంటరిచ్చారు. ప్రతీ ఒక్కరు అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కేంద్ర ఆయుష్ శాఖకు తమిళ వైద్యులు ప్రశ్నించకపోవడం మన వైద్యుల వినయానికి నిదర్శనమని కమల్ అన్నారు.

కాగా రాజేష్ కొట్టేచాపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రజాప్రతినిధులు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని.. అది దేశ భాష కాదంటూ విమర్శిస్తున్నారు.


Tags:    

Similar News