నెమ్మదిగా కమల్ హాసన్ లోని నటుడు పక్కకు వెళ్లిపోతున్నాడు. ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడు. ఇన్నాళ్లూ రాజకీయంగా ట్విట్టర్ వరకే చైతన్యం చూపించిన కమల్.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలోకి దిగిపోయాడు. అతి త్వరలోనే రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న కమల్.. ఓ సమస్య మీద పోరాటానికి నడుం బిగించాడు. తన మద్దతుదారులు.. అభిమానులు.. పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నూర్ ప్రాంతంలో పర్యటించాడు. అక్కడ పవర్ ప్లాంట్ల వల్ల కాలుష్యం ముంచెత్తి పరిసర ప్రాంతాలు దారుణమైన స్థితికి చేరుకోవడంపై కమల్ ఆందోళన వ్యక్తం చేశాడు. తన పర్యటన ముగిసిన అనంతరం అక్కడి పరిస్థితుల గురించి ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు గుప్పించాడు కమల్.
ఈ ప్రాంతంలో కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నదులు - చెరువులు కలుషితమవుతున్నాయని.. జాలర్లు జీవనాధారం కోల్పోతున్నారని.. ఈ ప్రాంత ప్రజలు ఏకతాటి పైకి వచ్చి సమస్యపై పోరాడాలని కమల్ పిలుపునిచ్చాడు. ఇందుకు తన వంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మున్ముందు మరిన్ని సమస్యలపై కమల్ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. జయలలిత మరణం తర్వాత కమల్ రాజకీయాలపై చాలా చురుగ్గా స్పందిస్తున్నారు. అధికార అన్నాడీఎంకేతో పాటు మిగతా పార్టీల మీదా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కమల్ కంటే ముందు రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్న రజినీ కొంచెం నెమ్మదించగా.. కమల్ మాత్రం చాలా వేగంగా రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు.