టీడీపీ ఎంపీలు అరిచి గీ పెట్టినా.. పొత్తు వదులుకుంటామని భయపెడుతున్నా బీజేపీ అధిష్ఠానం మాత్రం డోంట్ కేర్ అంటోంది. అంతేకాదు.. పుండు మీద కారం చల్లినట్లుగా ఏ రాష్ర్టానికీ ఇవ్వనంత ఏపీకి ఇచ్చామంటూ లెక్కలు చెప్తోంది. ఇదంతా ఏం చేశావ్ చంద్రబాబూ.. అన్నట్లుగా ఏపీకి ఇచ్చిన నిధుల లెక్కను కేంద్రం మరోసారి వెల్లడించింది. అంతేకాదు.. విభజన చట్టంలోని హామీలన్నీ పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా తాము మూడున్నరేళ్లలో85 శాతం పూర్తి చేశామని చెప్పింది
దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఆంధ్రప్రదేశ్ కు మూడున్నరేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అందజేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు - ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి లెక్కలన్నీ చెప్పారు. మూడున్నరేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులు - సంస్థల వివరాలతో కూడిన 27 పేజీల నోట్ ను మీడియాకు విడుదల చేశారు.
ఏపీ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్ లోని సంస్థలను పదేళ్లలోపు అమలు చేయాలని ఉన్నప్పటికి తమ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 85శాతం హామీలను పూర్తిచేసిందని హరిబాబు తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీ కింద సుమారుగా ఇప్పటికే 4వేల కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. మిగిలిన బకాయిల ఎంతనేదానిపై అంగీకారానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా కేవలం 5 సంస్థలు నెలకొల్పే విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దుగరాజపట్నం విషయానికొస్తే... దుగరాజపట్నం పోర్టు విషయంలో ఇస్రో నుంచి అభ్యంతరాలు ఉండడంతో దానికి బదులు వేరే ప్రాంతంలో ఓడరేవుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాలని కేంద్రం కోరిందని చెప్పారు. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు ద్వారా నిధుల అందజేస్తున్నామని తెలిపారు. పనుల పురోగతిని బట్టి నిధుల విడుదల నిరంతరంగా కొనసాగుతుందన్నారు.
27 పేజీల నోట్ లో చెప్పిన లెక్క ఇదీ..
* దేశంలో 24గంటల కరెంటు కోసం మూడు రాష్ట్రాలను ఎంపిక చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అందువల్లే విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ఏపీకి 24 గంటల కరెంటు సాధ్యమైంది.
* ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోట్ల రూపాయల విలువైన రోడ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
* అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 3500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. రాజధానిలో భవన నిర్మాణాలు మొదలు పెడితే మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు.
తాను వెల్లడించిన వివరాల్లో తప్పుంటే జవాబు చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
* విజయవాడ - విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు. పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి సంబంధించి రాష్ట్రం ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నారు.
* విశాఖపట్నంలో పెట్రో కాంప్లెక్స్ పై సాధ్యసాధ్యలపై అధ్యయనం జరుగుతోందన్నారు.
* ఏపీ కి రెవెన్యూలోటు కింద ఇప్పటి వరకు రూ.3,979.5 కోట్లు ఇచ్చామన్నారు. 14 వ ఆర్థిక సంఘం ద్వారా 2015 నుండి 2020 వరకు 5 సంవత్సరాలకు గాను మొత్తం 22,113 కోట్లు కేంద్రం ఇవ్వనున్నదని చెప్పారు.
* అమరావతి కోసం ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇవ్వగా - మరో వెయ్యి కోట్లు కేంద్రం ఇవ్వనుందన్నారు. స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ కింద రూ.1,050 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.
* పోలవరం కోసం ఇప్పటికే రూ.4662.28 కోట్లు ఇచ్చినట్లు నోట్ లో తెలిపారు.
* తిరుపతి ఐఐటీ కి రూ.90.93 కోట్లు కేంద్రం విడుదల చేసిందని చెప్పారు.
* ఇప్పటికే ఐఐటి - నిట్ - ఐఐఐటి నెలకొల్పామన్నారు. అనంతరపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి 10 కోట్లు ఇచ్చామని తెలిపారు. తిరుపతిలో ఐఐఎస్ ఈఆర్ - విశాఖలో ఐఐఎం - గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం - వైజాగ్ లో ఐఐపిఈ ఏర్పాటు చేశామన్నారు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు విడుదల చేశామని తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థకు ఇప్పటికే 70 కోట్లు విడుదల చేశామని చెప్పారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ - ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ ను అనంతపురంలో నెలకొల్పా మన్నారు.
* నెల్లూరు వద్ద ఎస్సో నిట్ సంస్థకు శంకుస్థాపన చేశామని తెలిపారు. నెల్లూరులో ఎన్ సిఆర్ టికి చెందిన రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
* ఎంఎస్ ఎంఈ టెక్నాలజీ సెంటర్ - నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ - సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ - స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ - రీజినల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సెంటర్ - రీజినల్ పాస్ పోర్టు - లక్ష కోట్ల జాతీయ రహదారులు - అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు - సేతు భారతం ప్రాజెక్టు మంజూరు.
* కేజీ బేసినల్ లో ఒఎన్ జిసి ప్లాంట్ లో 68వేల కోట్ల రూపాయలు కేంద్రం పెట్టుబడులు పెడుతుందన్నారు. వైజాగ్ – చెన్నై కారిడార్ కు సంబంధించి ఏడిపి నుంచి 2500 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని నోట్ లో పేర్కొన్నారు.
* భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
* వైజాగ్ స్టీల్ ప్లాంట్ విస్తరణకు 38500 కోట్లు పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు.
* కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెయిల్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే స్టీల్ ప్లాంట్ స్థాపనకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మరో టాస్క్ ఫోర్స్ నియమించినట్లు తెలిపారు.
* నిమ్మకూరులో బెల్ సంస్థ ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు.
* దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ యోజన కింద రాష్ట్రానికి 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకోసం గ్రిడ్ లు - ఫీడర్ ల కోసం 941 కోట్లరూపాయలు విడుదల
* ఉజల పథకం కింద 2.1 కోట్ల ఎల్ ఇడి బల్బులు ఇచ్చామన్నారు.
* రైల్వే కింద ఇప్పటివరకు 47, 989 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరయ్యాయని చెప్పారు.