అరే.. ఏం చెప్పావ్ క‌న‌క‌మేడ‌ల‌..?

Update: 2018-07-04 04:52 GMT
చెప్పేందుకే నీతులు ఉంటాయ‌ని ఊరికే అన‌లేదు. ఏపీ తెలుగు త‌మ్ముళ్ల లాంటోళ్లు భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌న్న ఆలోచ‌న‌తోనే పెద్దోళ్లు ఇలాంటి సామెత‌ల్ని సిద్ధం చేశారేమో?  రాజ‌కీయం త‌ప్పించి ప్ర‌జా సంక్షేమం ప‌ట్ట‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు నిత్యం విప‌క్షాల్ని విమ‌ర్శించ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్లుంది.

ప్ర‌తి విష‌యంలోనూ నీతులు చెప్పే తెలుగు త‌మ్ముళ్ల‌కు గురివింద సామెత‌ను గుర్తుంచుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. నాలుగేళ్ల పాటు ఏపీ ప్ర‌యోజ‌నాల్ని మోడీ కాళ్ల ముందు ఉంచేసి.. ఎంచ‌క్కా కాలం గ‌డిపేసిన వారు.. ఇప్పుడేమో మోడీ పేరుతో చేస్తున్న రాజ‌కీయం అంతా ఇంతా కాదు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ మోడీ స‌ర్కారును ఎన్నేసి మాట‌లు అనాలో అన్నేసి మాట‌లు అనేస్తున్న వైనం.

తాజాగా టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ చేసిన వ్యాఖ్య‌లు కామెడీని త‌ల‌పిస్తున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనూ.. కేంద్రంతోనూ లోపాయ‌కారీ ఒప్పందం కానీ లేకుంటే తాము చేప‌ట్టే విశాఖ రైల్వే జోన్ దీక్ష‌లో పాల్గొనాలన్న మాట‌ను చెబుతున్నారు. విభ‌జ‌న హామీలు కోసం టీడీపీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు కేంద్రంపై చేసే పోరాటాల్ని ప‌వ‌న్ గుర్తించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ను సంధిస్తున్నారు.

క‌న‌క‌మేడ‌ల చెప్పింది నిజ‌మ‌ని అనుకుందాం.. మ‌రి.. ఇదే డిమాండ్ సాధ‌న కోసం ఏపీ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ప‌లుమార్లు దీక్ష‌ల్ని చేప‌ట్టారు. అధికార‌ప‌క్షంగా.. విప‌క్షాల్ని లీడ్ చేసే నేత‌గా త‌మ ప్ర‌తినిధుల‌ను ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం చేస్తున్న దీక్ష‌కు ఎందుకు పంప‌న‌ట్లు?  మ‌రెందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ట్లు? 

నాలుగేళ్లు కులాశాగా కాలం గ‌డిపేసిన చంద్ర‌బాబు ఈ రోజు రైల్వే జోన్ సాధ‌న అంటూ హ‌డావుడి చేసినంత మాత్రాన గ‌తాన్ని గుర్తు పెట్టుకోకుండా ప్ర‌జ‌లేమీ ఉండ‌ర‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ రోజు తాము దీక్ష చేస్తున్నాం కాబ‌ట్టి.. అంద‌రూ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలి.. ఎందుకంటే మేం చేసేది ప్ర‌జ‌ల కోస‌మంటూ క‌న‌క‌మేడ‌ల లాంటోళ్లు మాట‌లు చెప్ప‌టం బాగానే ఉంది. కానీ.. ఆయ‌న మాట‌లు విప‌క్షాలు అమ‌లు చేయాల‌ని అడిగే ముందు.. తామేం చేశార‌న్న‌ది చూసుకుంటే బాగుంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News