భారతదేశంలో హిందువులు లేకుండా చేయండి!

Update: 2015-07-16 05:47 GMT
మేధావుల్ని ఎందుకు గౌరవించాలి? వారి మాటల్ని శ్రద్ధగా ఎందుకు వినాలి? వారి మౌనాన్ని.. వారి మాటల్ని.. వారి అగ్రహాన్ని చూసి ఎందుకు భయపడాలి? అంటే.. దానికి సముచితమైన కారణం లేకపోలేదు.

నిద్రాణంగా ఉండే సమాజాన్ని వారు మేల్కొల్పుతారు. చైతన్యాన్ని నింపుతారు. ఒక కొత్త దిశా నిర్దేశాన్ని ఇస్తారు. గతించిన రోజుల్లో జరిగిన తప్పుల్ని మరి.. జరగకుండా చూస్తారు. అందుకే.. మేధావులంటే అంత మర్యాద.. అంత గౌరవం. అయితే.. మేధావుల ఆలోచనలు ఏ మాత్రం గతి తప్పినా.. అమృతం కావాల్సింది విషంగా మారిపోతాయి. ఒక జిన్నా ఆలోచనలు వేరుగా ఉంటే.. భారత ఉప ఖండం ఇంత అసహనంతో ఉండేదా? రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఇప్పుడున్నంత దారుణ పరిస్థితులు ఉండేవి కావు.

ఇలానే.. మేధావుల బుర్రలో నుంచి వచ్చే విచిత్రమైన వాదనలు సమాజంలో రెచ్చగొట్టేవిగా ఉండకూడదు. ప్రముఖ దళిత మేధావి కంచె ఐలయ్య సంగతి చూద్దాం. పురాణాల కాలంలో జరిగినవి దారుణాలని.. దళితుల్ని తొక్కేశారని ఆయన చాలానే వాదనలు చేస్తారు. ఇప్పటిసమాజంలోనే బ్రాహ్మణాధిక్యం ఉందని గొంతు చించుకుంటారు. పురాణాల నాటి సంగతులు మనకు తెలీవు కాబట్టి.. మనం చెప్పలేం కానీ.. ఇప్పటి పరిస్థితుల్నే చూద్దాం.
నిజంగా బ్రాహ్మణ అధిక్యం ఉండి ఉంటే.. ఐలయ్య లాంటి వారి నోటి నుంచి రెచ్చగొట్టే మాటలు వచ్చేవా?
భారతదేశం లాంటి విశాలమైన సమాజంలో చాలానే వర్ణాలు.. చాలానే జాతులు ఉంటాయి. ఒక జాతిలో ఎవరో ఒకరు తప్పు చేస్తే.. దానికి బాధ్యత ఆ జాతి మొత్తం వహించాలన్న చిత్రమైన వాదన ఐలయ్య మాటల్లో వినిపిస్తుంది. దళిత శక్తిని సమీకరించటం.. వారి హక్కుల కోసం పోరాడటాన్ని ఎవరూ వ్యతిరేకించరు. వద్దనరు. కానీ.. ఆ పేరుతో మిగిలిన జాతుల్ని.. వర్ణాల్ని తిట్టిపోయేటం.. వారి మనోభావాలు నొచ్చుకునేలా మాట్లాడటంలో అర్థం ఏమిటి?

తాజాగా ఆయన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. అప్పికట్ల భరత్ భూషణ్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఆశ్చర్యంతో మాత్రం.. మరీ ఇంతలానా? అన్న ప్రశ్న తలెత్తటం ఖాయం. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటి చూస్తే..
‘‘వేదాలు.. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయాలి’’

‘‘ఈ దేశంలో బ్రాహ్మణ.. అగ్రకుల అధిపత్యం నశించి.. అంబేడ్కర్.. పూలే కలలు నెరవేరాలి’’

‘‘ఇందుకోసం బ్రాహ్మణ వ్యతిరేక రచనలు చేయాలి’’

‘‘బ్రాహ్మణులపై పోరాడే తెలివి వెనుకబడిన వర్గాలకు లేదు. క్రైస్తవులు.. దళిత మేధావులే ఆ పని చేయాలి’’

‘‘గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా వెళ్లకుండా క్రైస్తవుల.. దళితులు చూడాలి’’

ఎవరు నమ్మిన నమ్మకాల్ని వారు ఆచరించటంలో తప్పు లేదు. కానీ.. ఒకరి ధర్మాన్ని తప్పు పట్టి.. తిట్లు తిట్టేసి.. ఒకరిని దుర్మార్గులుగా.. మరొకరిని చేతకాని వారిగా చెబుతూ.. వారిని రెచ్చగొట్టటంలో అంతర్యం ఏమిటి? మేధావులు సమాజంలో శాంతిని పెంచేలా ప్రయత్నించేలా కానీ.. విభేదాలతో కొట్టుకు చచ్చేలా చేయకూడదు. ఇలాంటివి కంచె ఐలయ్య లాంటి వారికి అర్థం కాకపోవటమే మహా విషాదం.
Tags:    

Similar News