ట్విట్టర్ సీఈవో మార్పుపై కంగనా వ్యాఖ్యలు వైరల్

Update: 2021-11-30 10:35 GMT
ప్రపంచంలోనే దిగ్గజ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు సీఈవోగా మన భారతీయుడు ఎన్నికవ్వడంపై దేశంలో హర్షం వ్యక్తం అవుతోంది. ట్విట్టర్ ను స్థాపించిన వారిలో ఒకరైన ప్రస్తుత సీఈవో జాక్ డోర్సే దిగిపోయి మన భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కు కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పజెప్పారు.

ట్విట్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేరిన పదేళ్లలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరాగ్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా సీఈవో మార్పుపై తనదైన శైలిలో స్పందించారు. ‘జై చాచా జాక్’ అంటూ ఫన్నీగా కంగనా రాసుకొచ్చారు. కంగనా ఇలా ఫన్నీగా స్పందించడానికి కూడా ఓ కారణం ఉంది.

గతంలో కంగనా వివాదాస్పద ట్వీట్ చేసిందన్న కారణంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో అప్పట్లో కంగనా ట్విట్టర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో లేని కంగనా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ట్విట్టర్ సీఈవో మార్పుపై హర్షం వ్యక్తం చేసింది. మన భారతీయుడి సారథ్యానికి మద్దతు తెలిపింది.

ఇక తనకు ప్రాణహాని ఉందని పంజాబ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది కంగనా.. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిపై తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడుతానని తేల్చిచెప్పింద కంగనా..
Tags:    

Similar News