ఒకప్పుడు గ్లామర్ డాల్ గా సెన్సేషన్ సృష్టించిన కంగనా రనౌత్ .. ప్రస్తుతం ఓ వివాదాస్పద నటిగా మారిపోయారు. ఆమె ఎప్పుడు ఏం ట్వీట్ పెడుతుందో? ఏం ప్రకటన చేస్తుందో అని మీడియా ఎదురు చూస్తున్నది. తన తోటి హీరోయిన్ల పై నిత్యం ఆరోపణలు చేస్తుంటుంది కంగనా. అంతేకాక బీజేపీ పై ఈగ వాలిన ఆమె సహించ లేదు. బీజేపీ కి వ్యతిరేకంగా దేశం లో ఉన్న ఏ సెలబ్రిటీ మాట్లాడినా వాళ్లపై రెచ్చిపోయి ట్వీట్లు పెడుతూ ఉంటుంది ఈ బాలీవుడ్ భామ. ముంబైలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వం పై ఆమె ఓ రకంగా యుద్ధమే చేశారు. కంగానాకు చెందిన ఆఫీసు, ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అక్కడి అధికారులు కూల్చివేశారు కూడా. అయితే ఈ చర్యపై ఆమె కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే తాప్పిపై కూడా కంగానా ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ఉంటారు. ఆమె బీ గ్రేడ్ నటి అంటూ ఆరోపణలు గుప్పించారు. వీరిద్దరి మధ్య కొంతకాలం వార్ సాగింది. తాజాగా కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ సంచలన అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో కంగనా ఆరోపణలు గుప్పించారు. గతంలో తాను మహారాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై అక్కడి ప్రభుత్వం కక్ష గట్టిందని ఆమె ఆరోపించారు. తనను బెదిరించారని .. తన ఇంటిని, ఆఫీసును ధ్వంసంచేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు గుప్పించారు.
ఇప్పుడు దేశభక్తులెవరో, అవినీతిపరులెవరో బయటపడిందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు చెందిన మరికొందరు అవినీతిపరులైన మంత్రులు, రాజకీయనేతల ఆరోపణలు బయటకు వస్తాయంటూ ప్రకటించారు. తాను నిజమైన దేశభక్తి పరురాలినని చెప్పుకొచ్చారు. కొందరు నకిలీ దేశ భక్తులు ఇక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు.