ప్రధాని నరేంద్రమోడీ ఈ ఉదయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరం కాలంగా రైతులు పోరాడుతున్న సాగు చట్టాలపై వెనకడుగు వేశారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ప్రకటనతో ఉత్తర భారత రైతులు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర రైతులు పండుగ చేసుకుంటున్నారు.
అయితే దేశవ్యాప్తంగా రైతులు, మేధావులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆమె బాలీవుడ్ నటి కంగనా రనౌత్. కంగన తాజాగా
తన ఇన్‌స్టాగ్రామ్ లో దీనిపై స్పందించింది. ‘సాగు చట్టాల రద్దు 'విచారకరమైనది, అవమానకరమైనది. పూర్తిగా అన్యాయం' అనే పదాలను ఉపయోగించింది.
"పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే ... ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు" అని కంగనా అదే పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కంగనా రనౌత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు దుమారం రేపాయి. 'జిహాదీ' దేశం అని పిలవడం అవాంఛనీయ సమస్యలను ఆహ్వానిస్తుందని తెలిపింది. అయితే కంగనాకు ఇలా నోరుజారడం కొత్త కాదు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో ఇందిరా గాంధీ 104వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది. "దేశం మనస్సాక్షి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, లాత్ (కర్ర) ఒక్కటే పరిష్కారం నియంతృత్వమే ఏకైక తీర్మానం.. హ్యాపీ బర్త్‌డే మేడమ్ ప్రైమ్ మినిస్టర్" అని ఇందిరాగాంధీని అవమానించేలా కంగనా రనౌత్ కామెంట్ చేశారు. ఇది అపహాస్యం చేసే విధంగా ఉందని చాలా కామెంట్లు వినపడ్డా ఆమె వెనక్కి తగ్గలేదు.