బ్రిట‌న్ భారత్‌కు ప‌రిహారం చెల్లించ‌క్క‌ర్లేదా? మ‌రో బాంబు పేల్చిన‌ కంగ‌నా

Update: 2021-11-15 01:30 GMT
ఇటీవ‌ల కాలం లో హాట్ కామెంట్ల‌తో మీడియా లో నిలుస్తున్న బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ .. 2014 త‌ర్వాతే.. దేశాని కి స్వాతంత్య్రం వ‌చ్చిందంటూ.. వ్యాఖ్యానించిన విష‌యం.. ఇంకా చ‌ర్చ‌ నీయాంశంగానే ఉంది. ఇంత‌ లోనే మ‌రో బాంబు పేల్చింది. 2015 లో బీబీసీ ప్ర‌సారం చేసిన‌.. ఒక క‌థ‌నాన్ని త‌న ఇన్ స్టాలో పేర్కొంటూ.. కొన్ని ప్ర‌శ్న‌లు సంధించింది.  

బ్రిటన్ భారత దేశానికి ఎటువంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని వాదిస్తూ 2015లో BBC ప్రచురించిన కథనాన్ని కంగ‌నా త‌న ఇన్ స్టా లో అప్‌ లోడ్ చేసింది. ఇదే స‌మయం లో ప్ర‌స్తుత స‌మ‌యం లోను.. గ‌డిచిన కాలంలోనూ శ్వేత వలసవాదులు లేదా వారి సానుభూతిపరులు ఈ విష‌యం నుంచి ఎందుకు, ఎలా తప్పించుకోగలరు? అని నిల‌దీసింది.

అంతే కాదు, స్వాతంత్య్ర పోరాట స‌మ‌యం లో.. మన దేశ సంపదను దోచుకోవడం నుండి మన  సమరయోధులను నిర్దాక్షిణ్యం గా చంపడం వరకు.. మన దేశాన్ని రెండు భాగాలు గా విభజించడం వరకు భారత దేశంలో బ్రిటీష‌ర్లు చేసిన లెక్కలేనన్ని నేరాలకు మన దేశ నిర్మాతలు బ్రిటిష్ వారిని బాధ్యులను చేయలేదని నిప్పులు చెరిగింది.

చ‌ర్చిల్ మాటేంటి?

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, బ్రిటిష్ వారు తమ తీరిక సమయంలో భారతదేశాన్ని విడిచిపెట్టారు. విన్‌స్టన్ చర్చిల్‌ను యుద్ధ వీరుడిగా కీర్తించారు. నిజానికి బెంగాల్లో కరువుకు ఈయ‌నే కార‌ణం. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను కీర్తి పురుషుడిని చేశారు. మ‌రి ఆయ‌న చేసిన నేరాలకు సంబంధించి స్వతంత్ర భారత కోర్టులలో ఎప్పుడైనా విచారణ చేప‌ట్టారా?  లేదు! అని కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త దేశం గురించి.. ముక్కు మొహం తెలియ‌ని రాడ్ క్లిఫ్‌.. దేశాన్ని విభ‌జించాడ‌ని కంగనా పేర్కొది.
సిరిల్ రాడ్‌క్లిఫ్ అనే శ్వేతజాతీయుడు భారతదేశానికి ఇంతకు ముందెన్నడూ రాలేదు. కానీ, ఈయ‌న‌ను బ్రిటిష్ వారు కేవలం 5 వారాల్లో విభజన రేఖను గీసేందుకు భారతదేశానికి తీసుకువచ్చారు. విభ‌జ‌న కమిటీలో ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌లు కూడా స‌భ్యులుగా ఉన్నాయి. విభజ‌న నేప‌థ్యంలో జ‌రిగిన అల్ల‌ర్ల కార‌ణంగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి వీరికి స్వాతంత్య్రం వచ్చిన‌ట్టేనా? అని నిల‌దీశారు. నాటి విభ‌జ‌నకు కార‌ణ‌మైన‌.. బ్రిటిష‌ర్లు కానీ, ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ కానీ.. వీరి మ‌ర‌ణానికి బాధ్య‌త వ‌హించాయా?  లేదు! అని నిల‌దీశారు.

నెహ్రూ లేఖ‌

అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమించడానికి బ్రిటిష్ ఆమోదాన్ని అభ్యర్థిస్తూ మన మొదటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ 28 ఏప్రిల్ 1948లో  నాటి బ్రిటిష్ చక్రవర్తికి ఒక లేఖ రాశారు. అటువంటి లేఖ ఉన్నట్లయితే, ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌ వారి నేరాలకు బ్రిటిష్ వారిని బాధ్యులను చేయడానికి ప్రయత్నించిందని మీరు నమ్ముతారా? అలా అయితే, నా ప్రకటన ఎలా తప్పుగా ఉందో వివరించండి! అని కంగ‌నా ప్ర‌శ్నించింది.

ఇలా చేస్తార‌ని వారికి తెలుసా?

స్వతంత్ర భారతదేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు.. బ్రిటిష్ వారు , మన దేశ నిర్మాతలు అవిభక్త భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తారని, ఫలితంగా పది లక్షల మందిని ఊచకోత కోస్తారని తెలుసా? అని నిల‌దీసింది.

బాధ్యుల‌ను చేయ‌రా?

భారతదేశం లో జరిగిన అనేక నేరాలకు మనం బ్రిటిష్ వారిని బాధ్యులను చేయకపోతే, మనం ఇంకా మన స్వాతంత్య్ర‌ సమరయోధులను అగౌరవ పరుస్తున్నామని చెప్పేందుకు నేను ఏమాత్రం సంకోచించ‌ను. అని కంగనా కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News