కన్నయ్య కుమార్ ను చంపేయబోయాడు..

Update: 2016-04-24 09:33 GMT
 దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన విద్యార్థి నేత కన్నయ్య కుమార్ తాజాగా సంచలన ఆరోపణ చేశారు. ముంబై నుంచి పుణెకు విమానంలో ప్రయాణిస్తున్న తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.  తనను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని, తన గొంతును నులిమేందుకు చూశాడని కన్నయ్య ఈ రోజు మీడియా ముందు చెప్పారు. ఆ వ్యక్తి తనను చంపాలని చూస్తే.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది మాత్రం తనకు విమానం నుంచి దించేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

కాగా, కన్నయ్యపై దాడి జరిగిన విషయాన్ని ముంబై విమానాశ్రయ భద్రత అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. కన్నయ్య గొంతు నులిమిన వ్యక్తి ని మానస్ జ్యోతి డేకాగా గుర్తించామని చెబుతున్నారు. నిందితుడు టీసీఎస్ లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, బీజేపీ మద్దతుదారని తెలుస్తోంది. మరోవైపు దాడి చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని కన్నయ్య ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రయాణికుల భద్రత తమకు ముఖ్యం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కన్నయ్యను ప్రయాణానికి అనుమతించలేకే దించేశామని జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది చెబుతున్నారు.

అయితే.. దీనిపై కన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేవలం మీడియా ముందు విషయం వెల్లడించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బూట్లు విసరడం వంటి సంఘటనల మాదిరిగానే ఇది కూడా ఉద్రేకంతో చేసిన చర్యే కావచ్చన్న వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News